కరోనా మీద యుద్దం చేయడానికి యావత్తు ప్రపంచం పోరాటం చేస్తుంది. ప్రతి ఒక్కరు తమ యొక్క ఆరోగ్యం మీద దృష్టి సారిస్తున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని పూర్వీకులు ఆనాడే చెప్పడం జరిగింది. కానీ మారుతున్న జీవన శైలి కారణంగా మన ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ రోగనిరధకశక్తి ఎంతో అవసరం. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు వారు ఎటువంటి వైరస్సేనా సులభంగా ఎదుర్కోగలుగుతారు. అంతే కాకుండా ఎంత ఎక్కువ యాంటీబాడీస్ మన శరీరంలో ఉంటే మనకు అంత మంచిది ఈ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో.
శరీరంలో ఎక్కువ యాంటీబాడీస్ ఉన్న వ్యక్తులు కరోనా నుండి త్వరగా బయట పడుతున్నారు అని తెలుస్తుంది. ఇపుడు ప్రపంచం మొత్తం యాంటీబాడీస్ జపం చేస్తుంది కూడా. అమెరికా వంటి దేశాలలో కరొనను జయించిన వారి నుండి యాంటీబాడీస్ సేకరించి , కరోనా పేషంట్స్ కి ఎక్కిస్తున్నారు. యాంటీబాడీస్ అనేది ఒక వాక్సిన్ వంటిది. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఈ పద్ధతినే పాటిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా యాంటీబాడీస్ మీద దృష్టి సారించారు. ముందుగా అసలు యాంటీబాడీస్ ఎలా పెంచుకోవాలి, అవి ఎలా వస్తాయో తెలుసుకుందాం.
విటమిన్ ఫుడ్ తీసుకోవడం – అందరు చెప్తున్నట్టు గానే విటమిన్ – సి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనేది వాస్తవం. పుల్లటి పళ్ళను తింటే శరీరానికి కావల్సిన యాంటీ బాడీస్ పెరుగుతాయి. బత్తాయి, ద్రాక్ష, నిమ్మకాయలు, మామిడి, టమాట, పుచ్చకాయ, బొప్పాయి, బ్రకోలి వంటి వాటిలో విటమిన్స్ అధికంగా ఉంటాయి.
విటమిన్-డి – మన యొక్క బాడీకి సూర్యరశ్మి ఎంతో అవసరం. సూర్య రష్మి వల్ల శరీరానికి విటమిన్-డి అందుతుంది. ప్రతి రోజూ ఉదయం ఎండలో కాసేపు నడవడం వలన విటమిన్-డి లభిస్తుంది. పొద్దున, సాయంత్రం అరగంట సేపు నడవడం వలన విటమిన్-డి టాబ్లెట్స్ వేసుకునే అవసరం ఉండదు.
ప్రోటీన్ ఫుడ్ – మానవ శరీరంలోని మంచి బ్యాక్టీరియా, మంచి సూక్ష్మ క్రిములు తయారయ్యేది ప్రోటీన్స్ ద్వారానే.. కాబట్టి ప్రోటీన్స్ అధికంగా ఉంటే గుడ్లు, మాంసం, బడం, జీడి పప్పులు వంటి అధికంగా తీసుకోవాలి.
ఒత్తిడి – మొదటగా ఎటువంటి వత్తిడి లేకుండా చూసుకోవాలి. ప్రతి చిన్న వాటికి టెన్షన్ పడకూడదు. నచ్చినవి చేసుకుంటూ నచ్చిన వారితో కాసేపు మాట్లాడం వంటి వాటితో ఒత్తిడి తగ్గించుకోవచ్చు. యోగ, ధ్యానం వంటి ఒత్తిడిని దూరం చేస్తాయి.
ఆహారం – ఇంటిలో వండిన ఆహారం తినడం మంచిది. ఇపుడు ఎలాగో లాక్ డౌన్ లో వండుకోవల్సిందే కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవటం ఉత్తమం. వేపుడులు తగ్గింది, సలాడ్స్, పులుసులు ఉడికించిన ఆహారం తీసుకోండి. ఆలివ్ ఆయిల్ వాడితే ఇంకా మంచిది.
మద్యం – మద్యం అనేది మన బాడీలోని యాంటీబాడీస్ ని చంపేస్తుంది కాబట్టి మద్యం పూర్తిగా తీసుకోకపోతేనే మంచిది అంటున్నారు వైద్యులు. ఇపుడు ఉన్న పరిస్తుతులో ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు అని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని ఆహారపు అలవాట్లను మార్చుకొని రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…