Anushka: సినిమా ఇండస్ట్రీకి సూపర్ సినిమా ద్వారా పరిచయమయ్యారు నటి అనుష్క శెట్టి. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె పలు సినిమాలలో నటించారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ నటిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె నవీన్ పోలిశెట్టితో కలిసి ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇందులో అనుష్క ఒక చెఫ్ పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా తాజాగా అనుష్క ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన సినీ కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇకపోతే ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి అనుష్క ఒక వింత వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తుంది. అయితే ఈమె బాధపడుతున్నటువంటి ఆ సమస్య తెలుసుకున్నటువంటి అభిమానులు ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ కోరుకుంటున్నారు.
మరి అనుష్క ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారు అనే విషయానికి వస్తే సాధారణంగా మనం కొన్ని సంఘటనలను చూస్తే నవ్వుతాము. అయితే ఆ నవ్వు కొన్ని సెకండ్ల పాటు ఉంటుంది. కానీ అనుష్క మాత్రం ఒకసారి నవ్వింది అంటే ఆపకుండా దాదాపు పది నిమిషాల పాటు అలాగే నవ్వుతూనే ఉంటారట. ఇలా ఆపకుండా నవ్వడం వల్ల ఎంతో ఇబ్బందికరంగా మారుతుందని ఈమె పలుమార్లు వెల్లడించారు. ఈ సమస్య కారణంగా షూటింగ్ సమయంలో కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారట. ఈ విషయం తెలిసిన అభిమానులు ఇలాంటి కష్టం మరి ఎవరికి రాకూడదంటూ కోరుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…