Categories: Movie News

క్రికెటర్ తో అనుష్క పెళ్ళి… వైరల్ అయిన న్యూస్ !!

టాలీవుడ్, కోలీవుడ్ అంటూ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో అనుష్క ఒకరు. అనుష్క ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటిపోయింది. అయినా కూడా చెక్కు చెదరని అందంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు స్టార్ స్టేటస్ ని అనుభవిస్తోంది. బాహుబలి సినిమాలో దేవసేన పాత్ర ఆమెకు దేశమంతా అభిమానులను సంపాదించుకుంది. “బాహుబలి” సినిమా తరువాత ఆమె స్టేటస్ మరింత పెరిగింది. ఈ పాత్ర చేసిన ఆ పాత్రలో పరకాయ ప్రేవేశం చేసే అనుష్క గతంలో కూడా “అరుంధతి”, “రుద్రమదేవి”, “బాగమతి” వంటి అద్భుమతమైన చిత్రాలతో సూపర్ హిట్ సినిమాలతో ఎందరో అభిమానుల మనసులు కొల్లగొట్టింది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్న అనుష్క ప్రస్తుతం “కోనా ఫిలిం కార్పొరేషన్ బ్యానర్” మీద కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న “నిశ్శబ్దం” అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో అనుష్క తో పటు మాధవన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తీ చేసుకునే పనిలో ఉంది.

అయితే స్వీటీ గురించి తాజాగా ఒక వార్త ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అదే అనుష్క పెళ్ళి. అదేంటి అనుష్క పెళ్లి ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే అనుకుంటున్నారా? నిజమే నలభై పదుల వయస్సు కి చేరువవుతున్న ఈ ముద్దుగుమ్మ మీద రోజు ఎదో ఒక గాస్సిప్ వస్తుంటే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మాత్రం టీమ్ ఇండియా క్రికెటర్ తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ చేస్తుందని టాక్. ఉత్తరాది క్రికెటర్ అని, పేరు స్పష్టంగా తెలియదు. అయినా ఇటువంటి రూమర్స్ ఇదివరకే చాలా వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ – అనుష్క ల గురించి చాలా సార్లు వినిపించిన రూమర్. అయితే వీరిద్దరూ మేము పెళ్ళి చేసుకోవడం లేదు, మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చాలా సార్లు చెప్పారు. ఇది మాత్రమే కాదు స్వీటీకి మరికొందరు హీరోలతో కూడా పెళ్ళి చేసుకోబోతున్నారు అని రూమర్స్ వినిపించాయి. అయితే ప్రస్తుతం వస్తున్న రూమర్ పై అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం స్వీటీ “నిశ్శబ్దం” చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రం ఇదివరకు జనవరి 31న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసినా కొన్ని అనివార్య కారణాల దృశ్యా ఈ చిత్రాన్ని తాజాగా ఈ సంవత్సరం ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

అనుష్క “నిశ్శబ్దం” చిత్ర టీజర్ మీకోసం

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago