Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇక నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో ఎంపికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టి స్పీకర్ ముందు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ క్రమంలోనే ముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఎదుట ప్రమాణస్వీకారం చేయగా అనంతరం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పేరును పిలవగానే ఒక్కసారిగా అసెంబ్లీ మొత్తం చప్పట్లతో హోరెత్తిపోయింది.
పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేయడానికి వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మొత్తం లేచి నిలబడ్డారు. ఇక నారా లోకేష్ తన స్థానంలో లేచి నిలబడి తన ఎదురుగా ఉన్న బల్లపై కొట్టి శబ్దం చేస్తూ తన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అనంతరం బుచ్చయ్య చౌదరి తన చేత ప్రమాణస్వీకారం చేయించారు.
అసెంబ్లీలో పవన్..
ఇలా ఇప్పటివరకు రాజకీయాలలో కొనసాగుతూ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ నేడు అసెంబ్లీలోకి అడుగుపెట్టడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి వీడియో క్లిప్పులను జనసేన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…