YS Jagan Mohan Reddy: 2019 సంవత్సరంలో 151 సీట్లతో అత్యధిక మెజారిటీ సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో ఘోర పరాజయం అయ్యారు. ఈయన ఈసారి ఎన్నికలలో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. ఇక కూటమి 164 సీట్లతో భారీ విజయాలను సొంతం చేసుకుంది.
ఇలా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరూ కూడా నేడు అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి రారనీ చాలామంది భావించారు. కానీ ఆయన నేడు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. 164 మంది అధికార నేతలతో కలిసి వైసిపి 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు.
ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి సైతం ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో తెలుగుదేశం నేతలందరికీ మర్యాదపూర్వకంగా నమస్కారం చేసి అనంతరం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఎదుట ఈయన శాసనసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఈయన అసెంబ్లీ అంటే ఒక కౌరవ సభ అని అక్కడికి వెళ్లి మనం చేసేదేమీ లేదని ఇదివరకు తన ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అయిన సమయంలో మాట్లాడారు దీనితో ఈయన అసెంబ్లీకి రారని అందరూ భావించారు.
ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారం..
ఇకపోతే నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ఆయన తన బాధ్యతలను నిర్వర్తించారు. ఇకపై ఈయన అసెంబ్లీలోకి వెళ్తారా లేదా అనేది తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…