ప్రస్తుతం కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. తాజాగా థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపధ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు కూడా వ్యాక్సిన్ వేసే ప్రక్రియను మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇదేల్లలోపు చిన్నారుల తల్లులు రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో గుర్తించాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు ప్రజారోగ్య సంచాలకులు డా.గీతాప్రసాదిని ఆదేశించారు. కరోనా థర్డ్ వేవ్ పిల్లపై ప్రభావం ఉంటుందన్న నేపధ్యంలో భవిష్యత్‌లో ఒక వేళ పిల్లలకు కరోనా సోకినా అది తల్లులకు సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వారికీ వ్యాక్సిన్ వేయాలని ఇటీవలె సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఇందులో భాగంగా ఎపీలోని గ్రామాలన్నిటిలోనూ ఐదేళ్ళ లోపు చిన్నరులున్న తల్లులను గుర్తించేందుకు ఆదేశాలిచ్చారు. వ్యాక్సిన్ వేయడానికి ఒకరోజు ముందుగానే టోకెన్‌లు ఇచ్చి ఆతరువాత వీరిని వ్యాక్సిన్ సెంటర్‌కు తీసుకువచ్చే బాధ్యతను ఆశా కార్యకర్తలకు, ఏఎన్‌ఎంలకు అప్పజెప్పారు. కాగా, వ్యాక్సిన్ అవసరమైన తల్లులు 15 లక్షల మందికి పైగానే ఉంటారని అంచనా. వయస్సుతో నిమిత్తం లేకుండా వీరికీ వ్యాక్సిన్ వేస్తారు. ఈ విధానం తలపెట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…