AP Election Result: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13వ తేదీ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వైసీపీ నేతలు తామే అధికారంలోకి రాబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమి నేతలు సైతం తామే అధికారంలోకి రాబోతున్నారని తెలుపుతున్నారు.
ఇక ఎన్నికల ఫలితాలపై ఇప్పటికి ఎన్నో సర్వేలు కూడా అధికారం ఎవరిది అనే విషయాలను తెలియచేస్తున్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు.ఏపీలో వైసీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు ఉంది అంటూ చెప్పుకొచ్చారు రఘువీరారెడ్డి.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ఎక్కువ మెజారిటీతో గెలవరని ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం 90 నుంచి 95 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఈయన తెలిపారు. ఇక ఈ ఎన్నికలలో పెద్ద ఎత్తున డబ్బు ప్రవాహం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క పార్టీ సుమారు 2 వేల కోట్ల వరకు ఖర్చు చేశారని రఘువీరా రెడ్డి తెలిపారు.
1000 లోపు మెజారిటీ..
సుమారు 100 స్థానాల్లో గెలిచిన వారికి 10000 లోపు మెజారిటీలే వస్తాయని చెప్పుకొచ్చారు. డబ్బు ప్రభావం లేని ఒకటి రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. అయితే అటు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ విపరీతంగా జరిగిందని తెలిపారు రఘువీరారెడ్డి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…