NTR:టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మంగళవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. మంగళవారం తెల్లవారుజామునే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఎన్టీఆర్ సమాధిపై పుష్పగుచ్చం పెట్టి నివాళులు అర్పించారు.
ఇక ఎన్టీఆర్ ఉదయమే ఘాట్ వద్దకు వస్తారనే విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక ఎన్టీఆర్ అక్కడికి రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తోసుకోవడమే కాకుండా ఎన్టీఆర్ ని చూడగానే సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో ఎన్టీఆర్ వారసుడిగా పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. అలాగే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
టీడీపీకి మద్దతు..
ఇలా టీడీపీకి ఎన్టీఆర్ దగ్గర కావాలని అభిమానులు ఆశిస్తూ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ ని దూరం పెడుతూ వస్తున్నారు. 2009 ఎన్నికలలో భాగంగా ఎన్టీఆర్ టిడిపికి మద్దతుగా నిలబడి ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ 101 వ జయంతి కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…