Featured

Apparao : జబర్దస్త్ కి ఇక వాళ్ళు పిలిచినా వెళ్ళను.. ఇకపై నా టార్గెట్ అదే..: అప్పారావు

Apparao : జబర్దస్త్ గురించి వాళ్ళ అనుభవాలు, ఆరోపణలు, వివరణలు వంటివి రోజూ యూట్యూబ్ లో వింటూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ నుండి సీనియర్ కమెడియన్స్ అందరూ ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తున్నారు. జబర్దస్త్ లో ఏం జరుగుతోంది అనేది హాట్ టాపిక్ అయిపోయింది. దీనితో జబర్దస్త్ కమెడియన్స్ ఇంటర్వ్యూ చేయడం కోసం యూట్యూబ్ చానెల్స్ కూడా ఉత్సాహం చూపిస్తున్నాయి.

మనసు నొచ్చుకుని జబర్దస్త్ నుండి వచ్చేసా…

సీనియర్ కమెడియన్ అప్పారావు కూడా జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసాడు. కరోనా లాక్ డౌన్ తరువాత వయసు మీద పడిన కమెడియన్స్ ను రావొద్దని చెప్పడంతో అప్పారావు జబర్దస్త్ కి దూరం అయ్యారు. ఇక ఆ తరువాత ఆయనను హోల్డ్ లో పెట్టడంతో నెక్స్ట్ ఎపిసోడ్ కి పిలుస్తాము అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడంతో మనసు నొచ్చుకుని జబర్దస్త్ నుండి బయటికి వచ్చేసారట అప్పారావు. ఆయనే వెళ్లి అవకాశం అడిగినా బుల్లెట్ భాస్కర్ టీంలో ఉండనని, వేరే టీంలో కో లీడర్ గా ఇచ్చినా, కంటెస్టెంట్ గా ఇచ్చినా ఓకే అని అడిగితే రాకింగ్ రాకేష్ టీం లో ఏసారు కానీ రెమ్యూనరేషన్ విషయంలో నాకు నచ్చకపోవడంతో బయటకు వచ్చేసాను అని చెప్పారు.

ఇక ప్రస్తుతం మా టీవీలో కామెడీ నైట్స్ లో జబర్దస్త్ కన్నా ఎక్కువ పేమెంట్ ఇస్తున్నారు. ఇక సినిమాల్లో చాలా చేస్తున్నాను, అవి కాక ఈవెంట్లు ఉన్నాయి అవి చాలు. మళ్ళీ జబర్దస్త్ కి పిలిచినా ఇక వెళ్ళను, మనసు నొచ్చుకున్నాక వెళ్ళలేను అని చెప్పారు. ఇక చేతి నిండా ఉంగరాలు కథ అడుగగా ఒళ్ళంతా వంద తులాలు బంగారం వేసుకోవాలన్నదే నా టార్గెట్, ఎప్పటికైనా సాధిస్తా అని చెప్పారు. జబర్దస్త్ నుండి అందరూ వెళ్ళిపోడానికి కారణం అడుగగా ఎవరి కారణాలు వారికి ఉంటాయి. ఇపుడు ఏ షో అయినా కళాత్మకం కాదు వ్యాపారాత్మకమే అంటూ చెప్పారు అప్పారావు.

Bhargavi

Recent Posts

‘బీజేపీ అహంకారానికి ఈ మంటలే సమాధానం’.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…

46 minutes ago

పాస్ చేయండి సార్ అంటూ బోర్డుకు కాల్.. విశాఖలో విద్యార్థి వింత ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…

55 minutes ago

కూతురి ప్రాణం తీశిన తండ్రి.. భువనగిరిలో దారుణం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…

1 hour ago

గురువారం పూజతో అదృష్టం మారుతుందా? కాశీలో అరుదైన బృహస్పతి ఆలయం.. గురు దోషాలకు ప్రత్యేక పరిష్కారం!

భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…

1 hour ago

రూ.10 కోట్ల స్కామ్ ఆరోపణలు.. మంగ్లీపై వివాదం మరింత ముదురు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…

2 hours ago

‘మహిళ గౌరవమే దేశ గౌరవం’.. బిల్లుల ముందు మోదీ ట్వీట్ వైరల్

పార్లమెంట్‌లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…

2 hours ago