ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలో సరుకులను రవాణా చేసేవాళ్లకు శుభవార్త చెప్పింది. రవాణా ఛార్జీలను గతంతో పోల్చి చూస్తే భారీగా తగ్గించింది. ఏపీఎస్‌ఆర్టీసీ రవాణా ఛార్జీలను తగ్గించడం ద్వారా సరుకు రవాణా విస్తరణను మరింత పెంచవచ్చని భావిస్తోంది. 100 కిలోమీటర్ల లోపు దూరానికి ఏపీఎస్‌ఆర్టీసీ ఛార్జీలను దాదాపు 50 శాతం తగ్గించడం గమనార్హం. ఏపీఎస్‌ఆర్టీసీ ఈ నిర్ణయం ద్వారా రైతులకు, చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చాలని భావిస్తోంది.
రవాణా ఛార్జీలు భారీగా తగ్గించడం ద్వారా సరుకు రవాణా చేసేవాళ్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. టన్నుకు 100 కిలోమీటర్ల లోపు వెయ్యి రూపాయలు, 500 కిలోలకు 100 కిలోమీటర్ల లోపు 500 రూపాయలు వసూలు చేస్తామని ఏపీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. కనీస లోడు మూడు టన్నులు ఉంటే ఆ లోడ్ కోసం ప్రత్యేక వాహనాన్ని కేటాయిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. రవాణా చేసే సరుకులకు టోల్ ఛార్జీలు, జీఎస్టీ ఛార్జీలు ఉండవని ఆర్టీసీ పేర్కొంది.
ఆర్టీసీ కార్గో సర్వీస్ లో సరుకులను రవాణా చేసే ఏజెంట్లు బుక్ చేసుకుని సరుకు రవాణా చేయవచ్చని ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఎవరైతే ఆర్టీసీ కార్గో ద్వారా బుక్ చేస్తారో వారికి నికర ఛార్జీపై ఏకంగా 5 శాతం తగ్గింపు ఉంటుందని ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ డిపోలు, సరకు రవాణా కౌంటర్లలో సంప్రదించి బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఛార్జీలను తగ్గించడం ద్వారా సరుకులను రవాణా చేసేవాళ్లకు ప్రయోజనం చేకూరనుంది.
ఏపీఎస్‌ఆర్టీసీ సరుకు రవాణా ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తోంది. అయితే సరుకురవాణా ఛార్జీలను ఎక్కువగా ఉండటంతో చాలామంది ఆర్టీసీ ద్వారా సరుకు రవాణాకు ఆసక్తి చూపలేదు. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…