Featured

వామ్మో.. కరోనా వ్యాక్సిన్ ను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా..?

రోజురోజుకు సోషల్ మీడియాకు ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో ప్రజలకు ఏవి నిజాలో ఏవి అబద్ధాలో అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలోని పోస్టులను నిజమని నమ్మే వాళ్లు దేశంలో చాలామందే ఉన్నారు. చాలామంది సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని నమ్మడంతో పాటు ఇతరులను నమ్మేలా చేస్తున్నారు. తాజాగా కరోనా వ్యాక్సిన్ గురించి వైరల్ అవుతున్న వార్తలను చూస్తే భవిష్యత్తులో వ్యాక్సిన్ ను అడ్డుకునే ప్రయత్నాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

కరోనా మహమ్మారి విజృంభించిన కొత్తలో చాలామంది మాంసం తింటే కరోనా వస్తుందని.. వస్తువులను తాకినా కరోనా వస్తుందని.. కొన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటే కరోనా సోకదని వింతవింత ప్రచారాలు చేశారు. భవిష్యత్తులో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా ఈ తరహా ప్రయత్నాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు వ్యాక్సిన్ వచ్చాక వ్యతిరేక ప్రచారం జరిగే అవకాశం ఉందని నమ్మేలా చేస్తున్నాయి.

మశూచి, అమ్మవారు, తట్టు లాంటి వ్యాధులకు వ్యాక్సిన్ ను కనుగొన్న తొలినాళ్లలో అలెగ్జాండర్‌ ఎం రోజ్ అనే వైద్యుడు వ్యాక్సిన్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవద్దని ఆయన కరపత్రాలు పంచాడు. కొన్ని కంపెనీలు డబ్బుల కోసం వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే వ్యాక్సిన్ పై ఆరోపణలు చేసిన అతను మాత్రం ముందుగానే ఆ వ్యాక్సిన్ ను తీసుకోవడం గమనార్హం.

ఆండ్రీవ్‌ వేక్‌ఫీల్డ్ అనే వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు ఆటిజం బారిన పడే అవకాశాలు ఉనాయని వెల్లడించారు. గతంలో ఏ కరోనా వ్యాక్సిన్ వచ్చినా ఈ తరహా వ్యతిరేక ప్రచారం జరిగింది. దీంతో కరోనాకు శాస్త్రవేత్తలు సమర్థవంతమైన వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చినా వ్యాక్సిన్ కు వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రచారం జరిగే అవకాశం ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

8 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

8 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

8 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

9 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

9 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

9 hours ago