మన నిత్య జీవితంలో స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ లేకుండా గంట సమయం కూడా గడపలేనంతలా ఫోన్ కు అడిక్ట్ అయ్యే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ శాతం మంది ఆండ్రాయిడ్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగించే వినియోగదారులకు కొత్త రాన్సమ్‌వేర్ వల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రచారం పొంచి ఉందని తెలుస్తోంది.
మాల్‌లాకర్.బి అని పిలిచే ఈ రాన్సమ్ వేర్ వల్ల మొబైల్ స్క్రీన్ యాక్సిస్ నిలిచిపోతుందని సమాచారం. ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా ఈ రాన్సమ్ వేర్ మన మొబైల్ లోకి చేరే అవకాశం ఉంటుంది. వెబ్ సైట్ లు, ఆన్‌లైన్ ఫోరమ్‌లు సైతం రాన్సర్ వేర్ బారిన పడటానికి కారణమవుతున్నాయి. కొంతమంది వెబ్ సైట్స్ నుంచి మొబైల్ ఫోన్లలో యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటూ ఉంటారు.
అలా యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే వాళ్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. వైరస్ వెబ్ సైట్ యాప్స్ ద్వారా ఒక ఫోన్ నుంచి ఇతర ఫోన్లను కూడా చేరుతుందని సమాచారం. ప్లే స్టోర్స్ నుంచి మాత్రమే యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుంటే ప్రమాదం బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. సాధారణంగా రాన్సమ్ వేర్ ల వల్ల మొబైల్ ఫోన్ ఎన్ క్రిప్ట్ అవుతుంది. మాల్‌లాకర్.బి మాల్‌వేర్ మిగతా రాన్సర్ వేర్ లతో పోలిస్తే భిన్నంగా ఉంది.
ఫోన్ డిస్ ప్లే నిలిచిపోయే విధంగా చేసే ఈ రాన్సమ్ వేర్ బారిన పడ్డ వాళ్లకు ఫోన్ లో ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఎవరైతే చెప్పిన మొత్తం చెల్లిస్తారో వారి ఫోన్లు మాత్రమే అన్ లాక్ అవుతాయి. అయితే రాన్సమ్ వేర్ వల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందో లేదో ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. రాన్సమ్ వేర్ మొబైల్ ఫోన్లను అటాక్ చేసే పరిస్థితులు ఉండటంతో వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…