రోజురోజుకు సోషల్ మీడియాకు ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో ప్రజలకు ఏవి నిజాలో ఏవి అబద్ధాలో అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలోని పోస్టులను నిజమని నమ్మే వాళ్లు దేశంలో చాలామందే ఉన్నారు. చాలామంది సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని నమ్మడంతో పాటు ఇతరులను నమ్మేలా చేస్తున్నారు. తాజాగా కరోనా వ్యాక్సిన్ గురించి వైరల్ అవుతున్న వార్తలను చూస్తే భవిష్యత్తులో వ్యాక్సిన్ ను అడ్డుకునే ప్రయత్నాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
కరోనా మహమ్మారి విజృంభించిన కొత్తలో చాలామంది మాంసం తింటే కరోనా వస్తుందని.. వస్తువులను తాకినా కరోనా వస్తుందని.. కొన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటే కరోనా సోకదని వింతవింత ప్రచారాలు చేశారు. భవిష్యత్తులో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా ఈ తరహా ప్రయత్నాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు వ్యాక్సిన్ వచ్చాక వ్యతిరేక ప్రచారం జరిగే అవకాశం ఉందని నమ్మేలా చేస్తున్నాయి.
మశూచి, అమ్మవారు, తట్టు లాంటి వ్యాధులకు వ్యాక్సిన్ ను కనుగొన్న తొలినాళ్లలో అలెగ్జాండర్ ఎం రోజ్ అనే వైద్యుడు వ్యాక్సిన్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవద్దని ఆయన కరపత్రాలు పంచాడు. కొన్ని కంపెనీలు డబ్బుల కోసం వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే వ్యాక్సిన్ పై ఆరోపణలు చేసిన అతను మాత్రం ముందుగానే ఆ వ్యాక్సిన్ ను తీసుకోవడం గమనార్హం.
ఆండ్రీవ్ వేక్‌ఫీల్డ్ అనే వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు ఆటిజం బారిన పడే అవకాశాలు ఉనాయని వెల్లడించారు. గతంలో ఏ కరోనా వ్యాక్సిన్ వచ్చినా ఈ తరహా వ్యతిరేక ప్రచారం జరిగింది. దీంతో కరోనాకు శాస్త్రవేత్తలు సమర్థవంతమైన వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చినా వ్యాక్సిన్ కు వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రచారం జరిగే అవకాశం ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…