మన నిత్య జీవితంలో స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ లేకుండా గంట సమయం కూడా గడపలేనంతలా ఫోన్ కు అడిక్ట్ అయ్యే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ శాతం మంది ఆండ్రాయిడ్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగించే వినియోగదారులకు కొత్త రాన్సమ్‌వేర్‌ వల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రచారం పొంచి ఉందని తెలుస్తోంది.

 

మాల్‌లాకర్.బి అని పిలిచే ఈ రాన్సమ్ వేర్ వల్ల మొబైల్ స్క్రీన్ యాక్సిస్ నిలిచిపోతుందని సమాచారం. ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ యాప్స్‌ ద్వారా ఈ రాన్సమ్ వేర్ మన మొబైల్ లోకి చేరే అవకాశం ఉంటుంది. వెబ్ సైట్ లు, ఆన్‌లైన్ ఫోరమ్‌లు సైతం రాన్సర్ వేర్ బారిన పడటానికి కారణమవుతున్నాయి. కొంతమంది వెబ్ సైట్స్ నుంచి మొబైల్ ఫోన్లలో యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటూ ఉంటారు.

అలా యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే వాళ్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. వైరస్ వెబ్ సైట్ యాప్స్ ద్వారా ఒక ఫోన్ నుంచి ఇతర ఫోన్లను కూడా చేరుతుందని సమాచారం. ప్లే స్టోర్స్ నుంచి మాత్రమే యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుంటే ప్రమాదం బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. సాధారణంగా రాన్సమ్ వేర్ ల వల్ల మొబైల్ ఫోన్ ఎన్ క్రిప్ట్ అవుతుంది. మాల్‌లాకర్.బి మాల్‌వేర్ మిగతా రాన్సర్ వేర్ లతో పోలిస్తే భిన్నంగా ఉంది.

ఫోన్ డిస్ ప్లే నిలిచిపోయే విధంగా చేసే ఈ రాన్సమ్ వేర్ బారిన పడ్డ వాళ్లకు ఫోన్ లో ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఎవరైతే చెప్పిన మొత్తం చెల్లిస్తారో వారి ఫోన్లు మాత్రమే అన్ లాక్ అవుతాయి. అయితే రాన్సమ్ వేర్ వల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందో లేదో ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. రాన్సమ్ వేర్ మొబైల్ ఫోన్లను అటాక్ చేసే పరిస్థితులు ఉండటంతో వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here