General News

కిచెన్‌లో బొద్దింకలు తిరుగుతున్నాయా? ఈ హోమ్ టిప్స్ మీకోసమే!

ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంచినా బొద్దింకల సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా వంటగది, సింక్ దగ్గర, చెత్త బుట్టల చుట్టూ ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఆహార పదార్థాలపై తిరగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే చాలామంది మార్కెట్‌లో దొరికే కెమికల్ స్ప్రేలను ఉపయోగిస్తుంటారు. అయితే వాటి వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే సులభంగా దొరికే కొన్ని పదార్థాలతో బొద్దింకలను దూరం చేసుకోవచ్చని హోమ్ కేర్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టమాటాతో చేసే ఒక సింపుల్ చిట్కా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిట్కా కోసం ఒక టమాటాను తీసుకుని మధ్యలో కోసి గుజ్జును కొద్దిగా తీసేయాలి. తర్వాత అందులో బేకింగ్ సోడా, పంచదార కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఉంచితే మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు. టమాటా, పంచదార వాసనకు ఆకర్షితులైన బొద్దింకలు ఈ మిశ్రమాన్ని తినడంతో వాటి సమస్య తగ్గుతుందని అంటున్నారు.

అంతేకాకుండా ఇంట్లో మరికొన్ని సహజ చిట్కాలు కూడా ఉపయోగపడతాయి. వంటగది అల్మారాల్లో లేదా డ్రాయర్లలో వేపాకు లేదా బిర్యానీ ఆకులు ఉంచితే వాటి వాసనకు బొద్దింకలు దూరంగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే వేప నూనెను నీటిలో కలిపి స్ప్రే బాటిల్ ద్వారా కిచెన్ మూలల్లో చల్లినా ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు.

కర్పూరం కూడా బొద్దింకలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. బాత్రూమ్, కిచెన్ ప్రాంతాల్లో కర్పూరం బిళ్లలు ఉంచితే వాటి వాసనకు బొద్దింకలు దగ్గరకు రావని గృహిణులు చెబుతున్నారు. అదేవిధంగా నేల తుడిచే నీటిలో నిమ్మరసం, వెనిగర్ కలిపి ఉపయోగిస్తే ఇంట్లో పరిశుభ్రత పెరగడంతో పాటు చీమలు, బొద్దింకల సమస్య కూడా తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు.

అయితే బొద్దింకల సమస్య పూర్తిగా తగ్గాలంటే ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాలను మూతపెట్టి ఉంచడం, చెత్తను ఎక్కువసేపు నిల్వ చేయకుండా వెంటనే బయటకు వేయడం వంటి అలవాట్లు పాటిస్తే ఈ సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు.

Swathi N

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago