Featured

రాజ్ తరుణ్ కు వార్నింగ్ ఇచ్చిన అరియానా.. చంపేస్తా అంటూ..

అనుభవించు రాజా.. ఈ చిత్ర బృందం సభ్యులు ప్రస్తుతం చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. అటు బిగ్ బాస్ లో కూడా సండే రోజూ ఫన్ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్ని కామెడీ షోల్లో, మరికొన్ని స్పెషల్ ఈవెంట్లలో కూడా మెరుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఈ ట్రైలర్లో మొదట ‘రూపాయి పాపాయి లాంటిది రా.. దాన్ని పెంచి పెద్ద‌ది చేసుకోవాలి కానీ.. ఎవ‌డి చేతిలో ప‌డితే వాడి చేతిలో పెట్ట‌కూడ‌దు.’ అంటూ వ‌చ్చే డైలాగుతో మొద‌లవుతుంది. ఇక సినిమాలో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డ్ గా కనిపించి.. తర్వాత పల్లెటూరు బ్యాగ్ గ్రౌండ్ లో కోడి పందాలతో సరదా లైఫ్ ను ఎంజాయ్ చేసే వ్యక్తిగా కనిపిస్తాడు. ‘వ‌చ్చే సంవ‌త్స‌రం ఇదే రోజు.. ఇక్క‌డే జెండా ఎగ‌రేస్తా.. ప్రెసిడెంట్‌గా ’ అంటూ చివ‌ర‌లో రాజ్‌త‌రుణ్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ప్రమోషన్లో భాగంగా బిగ్ బాస్ ఫేమ్ అరియానా రాజ్ తరుణ్ తో పాటు.. చిత్ర బృందం తో ఇంటర్వ్యూ తీసుకుంది. దీనిలో హీరోయిన్ ఇంగ్లీష్ లో పలు వ్యాఖ్యలు చేస్తుంది. దీనిని తెలుగులో చెబితే బాగుంటుంది అంటూ.. అరియానా చెబుతుంది. దానిని మీరే చెప్పేయవచ్చు కదా అంటూ ఆ టీంలో ఒకరు అడగ్గా.. తాను చిన్న పిల్లను.. నాకేం తెలియదు అంటూ సమాధానం ఇస్తుంది.

దీనికి కౌంటర్ గా రాజ్ తరుణ్ అవును వ‌ర్క‌వుట్స్ మాత్ర‌మే తెలుసని అనే స‌రికి అరియానా దెబ్బ‌కు సైలెంట్ అయింది. ‘రాజ్ చంపుతా నిన్ను అంటూ.. అరుస్తూ కామెడీని’ పంచుతారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూలో ఈ క్లిప్ వరకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రామ్ గోపాల్ వర్మతో ఆమె ఓ ఇంటర్వ్యూలో వర్కవుట్స్ చేస్తూ ఇంటర్వ్యూ తీసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద రచ్చ అయింది. దానినే ప్రస్తావిస్తూ రాజ్ తరుణ్ కామెడీగా అన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

10 minutes ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

25 minutes ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

33 minutes ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

42 minutes ago

రాజమౌళి గేమ్ ప్లాన్ రివీల్? సోషల్ మీడియాలో పెరుగుతున్న చర్చలు…

ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి తన మార్కెటింగ్ మైండ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రతి సినిమాకీ ముందుగానే ఖచ్చితమైన…

1 hour ago

బంగారం ధరలో స్వల్ప ఉపశమనం.. ఇవాళ తులం రేటు ఎంతంటే?

కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఒకరోజు ఒకలా మారుతూ కొనుగోలుదారులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. భారీ పెరుగుదల తర్వాత ఒక్కసారిగా…

2 hours ago