మెగస్టార్ వారసుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్.. తర్వాత ప్రాజెక్ట్ శంకర్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇక ఆ ఆ సినిమాలో ఒక ట్రైన్ సన్నివేశానికే రూ.10 కోట్లు వరకు ఖర్చు పెట్టారట. మొత్తం ఆ సినిమా రిలీజ్ హక్కులను జీ స్టూడియో రూ.350 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.
ఇదంతా ఇలా ఉండగా.. ఇటీవల కాలంలో సెలబ్రెటీలు ధరించిన దుస్తులు, వాచ్ లు, షూస్ ఇలా అన్నింటి ధరలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయ్. తన అభిమాన నటుడు ఎన్ని లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి.. తీసుకున్నారా అనే విషయాలు తెలుసుకోవాలనే ఆత్రుత సగటు అభిమానికి ఉంటుంది. అందుకే ఇలాంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
నాగార్జున విదేశాలకు వెళ్లినప్పుడు ఎక్కువగా కాఫీ పౌడర్, జూనియర్ ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు షూస్ తెచ్చుకునే అలవాటు ఉంది. ఇక రామ్ చరణ్ కూడా అంతే.. విదేశాలకు వెళ్తే.. ఖరీదైన వాచ్ లు కొనుగోలు చేస్తారట. ఇప్పుడు రామ్ చరణ్ ధరించిన వాచ్ ఖరీదు పై సోషల్ మీడియాలో తెగ గుస గుసలు వినిపిస్తున్నాయ్. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు 2 కోట్ల రూపాయలని ఆ వార్త హాల్ చల్ చేసింది.
ప్రస్తుతం రామ్ చరణ్ దగ్గర ఉన్న వాచ్ ఖరీదు రూ. కోటి అంటూ వైరల్ అవుతోంది. దాదాపు అన్ని ఫంక్షన్స్ కు ఆ వాచ్ తోనే వస్తుంటాడు రామ్ చరణ్. ఆ వాచ్ ఖరీదు విలువ బయటపడటంతో చాలామంది షాక్ అవుతున్నారు. అతడి దగ్గర దాదపు 7 ఖరీదైన వాచ్ లు ఉన్నట్లు సమాచారం. అందులో రూ.10 లక్షలు ఖరీదు చేసే వాచ్ నుంచి.. కోటి వరకు కూడా ఉన్నాయట. ప్రపంచంలో ఉన్న టాప్ బ్రాండ్స్ అన్నీ ఈయన దగ్గర ఉన్నాయంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…