అనుభవించు రాజా.. ఈ చిత్ర బృందం సభ్యులు ప్రస్తుతం చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. అటు బిగ్ బాస్ లో కూడా సండే రోజూ ఫన్ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్ని కామెడీ షోల్లో, మరికొన్ని స్పెషల్ ఈవెంట్లలో కూడా మెరుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఈ ట్రైలర్లో మొదట ‘రూపాయి పాపాయి లాంటిది రా.. దాన్ని పెంచి పెద్దది చేసుకోవాలి కానీ.. ఎవడి చేతిలో పడితే వాడి చేతిలో పెట్టకూడదు.’ అంటూ వచ్చే డైలాగుతో మొదలవుతుంది. ఇక సినిమాలో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డ్ గా కనిపించి.. తర్వాత పల్లెటూరు బ్యాగ్ గ్రౌండ్ లో కోడి పందాలతో సరదా లైఫ్ ను ఎంజాయ్ చేసే వ్యక్తిగా కనిపిస్తాడు. ‘వచ్చే సంవత్సరం ఇదే రోజు.. ఇక్కడే జెండా ఎగరేస్తా.. ప్రెసిడెంట్‌గా ’ అంటూ చివరలో రాజ్‌తరుణ్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ప్రమోషన్లో భాగంగా బిగ్ బాస్ ఫేమ్ అరియానా రాజ్ తరుణ్ తో పాటు.. చిత్ర బృందం తో ఇంటర్వ్యూ తీసుకుంది. దీనిలో హీరోయిన్ ఇంగ్లీష్ లో పలు వ్యాఖ్యలు చేస్తుంది. దీనిని తెలుగులో చెబితే బాగుంటుంది అంటూ.. అరియానా చెబుతుంది. దానిని మీరే చెప్పేయవచ్చు కదా అంటూ ఆ టీంలో ఒకరు అడగ్గా.. తాను చిన్న పిల్లను.. నాకేం తెలియదు అంటూ సమాధానం ఇస్తుంది.
దీనికి కౌంటర్ గా రాజ్ తరుణ్ అవును వర్కవుట్స్ మాత్రమే తెలుసని అనే సరికి అరియానా దెబ్బకు సైలెంట్ అయింది. ‘రాజ్ చంపుతా నిన్ను అంటూ.. అరుస్తూ కామెడీని’ పంచుతారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూలో ఈ క్లిప్ వరకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రామ్ గోపాల్ వర్మతో ఆమె ఓ ఇంటర్వ్యూలో వర్కవుట్స్ చేస్తూ ఇంటర్వ్యూ తీసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద రచ్చ అయింది. దానినే ప్రస్తావిస్తూ రాజ్ తరుణ్ కామెడీగా అన్నారు.
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…
ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్‌ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్‌నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…
అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ)…
మన రోజువారీ జీవితంలో సులభంగా దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. పండగలు, శుభకార్యాలు, ఇంటి వేడుకలు ఏవి జరిగినా ముందుగా…