Categories: FeaturedMovie News

Arjun Sarja : చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి అలా మాట్లాడారు.. మిస్ యూ అన్న పదంకి అర్థం ఆమె చనిపోయాకే తెలిసింది..!

Arjun Sarja : యాక్షన్ హీరో అర్జున్ అనగానే అసలు ఇతను ఏ ఇండస్ట్రీ హీరో అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే 90 లలో దాదాపు తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో హిట్లు కొట్టి అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అర్జున్ అసలు పేరు శ్రీనివాస సర్జా, మధుగిరి కర్ణాటకలో జన్మించిన ఈయన కెరీర్ మాత్రం తమిళ ఇండస్ట్రీ లో శంకర్ దర్శకత్వంలో జెంటిల్ మెన్ సినిమా హిట్ తో మొదలయింది. 1993 లో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. అయితే అప్పటికే తెలుగులో మా పల్లెలో గోపాలుడు సినిమాలో నటించాడు. ఇక తమిళంలో మాధవలన్ తెలుగులో ఒకేఒక్కడు సినిమాతో మరోసారి హిట్ కొట్టాడు. ఇక యాక్షన్ సినిమాలతో ఫ్యాన్స్ ను పెంచుకున్న అర్జున్ యాక్షన్ కింగ్ అయ్యాడు.

చిరంజీవి ఫోన్ చేసి అలా అంటరాని అనుకోలేదు….

రొమాంటిక్ లవ్ డ్రామా సినిమా రిధమ్ సినిమాతో అటు తమిళ్ ఇటు తెలుగులో మళ్ళీ హిట్ కొట్టిన అర్జున్ ఇక తెలుగు సినిమాలలో కూడా సక్సెస్ అయ్యాడు. శ్రీ మంజునాథ, జగపతి బాబు తో కలిసి హనుమాన్ జంక్షన్, స్వాగతం, పుట్టింటికి రా చెల్లి శ్రీ ఆంజనేయం, లై, ఇక లేటెస్ట్ గా ఖిలాడి వంటి సినిమాల్లో నటించారు. అటు సినిమాల్లో హీరోగా చేస్తూనే విలన్ గాను అలరించాడు. ఇక ఇపుడు విలన్ గాను మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు. శ్రీ మంజునాథ సినిమా విడుదల తరువాత సినిమాలో లాస్ట్ సీన్ చూసి చిరంజీవి ఫోన్ చేసి చాలా బాగా చేసావ్ అని చెప్పడం మర్చిపోలేనని ఆయన అలా ఫోన్ చేస్తారని అనుకోలేదని చెప్పాడు.

మిస్ యూ అన్న పదంకి అర్థం తాను పోయాక తెలిసింది, ఇప్పటికి ఆమెను మిస్ అవుతున్నా….

ఇక ఇండస్ట్రీ లో జగపతి బాబు, నేను, సౌందర్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళమని అర్జున్ చెప్పారు. సౌందర్య చాలా మంచి అమ్మాయి. తాను చాలా పద్దతిగా, కల్చర్డ్ గా ఉండేదని చెప్పారు. ఆమె లేని లోటు ఇప్పటికి ఉందని. ఎప్పుడైనా ఏదైనా విషయం ఫ్రెండ్ తో షేర్ చేయాలన్నపుడు సౌందర్య కి మెసేజ్ చేద్దామా అని ఇప్పటికి టక్కున గుర్తొస్తుందని, మిస్ యూ అన్న పదాలకు అర్థం ఆమె మరణించాకే తెలిసిందని చెప్పాడు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago