Arohi: బిగ్ బాస్ కార్యక్రమం నాలుగు వారాలను పూర్తి చేసుకొని హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్లు బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే నాలుగవ వారం కంటెస్టెంట్ ఆరోహి ఎలిమినేట్ కాగా ఈమె ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ శివ తనని ఎన్నో రకాల ప్రశ్నలు వేసి తన నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే యాంకర్ శివ పై ఆరోహి పెద్ద ఎత్తున ఫైర్ అయ్యింది.
హౌస్ లో నీ జర్నీ ఎలా సాగింది అంటూ శివ ప్రశ్నించగా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను అంటూ ఈమె సమాధానం చెప్పారు ఎవరితో కనెక్ట్ అయ్యావు అంటూ యాంకర్ ప్రశ్నించగా శ్రీహాన్, కీర్తి పేరు చెప్పింది. తప్పు చెబుతున్నావా? సేఫ్ గా ఆడుతున్నావా? అంటూ శివ ప్రశ్నించారు. ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అంటూ అరోహి ప్రశ్నించారు.
ఎప్పుడైతే నువ్వు నీకోసం ఆడటం పక్కన పెట్టావో నీ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది అంటూ శివ అనగా నేనెక్కడ గేమ్ విషయంలో తగ్గలేదని ఆరోహి చెప్పగా నువ్వు నా కళ్ళముందు కనపడటమే అందుకు నిదర్శనం అంటూ శివ సమాధానం చెప్పారు. హౌస్ లో ఆరోహి మితిమీరిందన్న ప్రశ్న ఎదురవడంతో మాది ప్యూర్ ఫ్రెండ్షిప్ అంటూ ఈమె సమాధానం చెప్పింది. ఇక్కడ ప్యూర్ ఫ్రెండ్షిప్ ఎవరికి కనపడలేదు అంటూ శివ ఎదురు ప్రశ్న వేశారు.
ఈ క్రమంలోనే ఆరోహి మాట్లాడుతూ పచ్చకామర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని గట్టిగా సమాధానం చెప్పడమే కాకుండా.. ఇంటర్వ్యూ అయినా సరే నువ్వు ఇలా మాట్లాడితే అసలు ఊరుకోను అంటూ శివ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…