Featured

Artist Keshav Deepak : అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం చాలా కష్టపడ్డారు… విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమా తరువాత ఇంతలా మారిపోతాడని అనుకోలేదు…: నటుడు కేశవ్ దీపక్

Artist Keshav Deepak : బళ్లారి కి చెందిన కేశవ్ దీపక్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి 2006 లో వచ్చిన స్టైల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. క్లాసికల్ డాన్సర్ అయినా ఆయన డాన్సర్ తో పాటు యాక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారు. నాటక రంగం నుండి వచ్చిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆచితూచి మంచి పాత్రలను ఎంచుకుంటూ ఇపుడిప్పుడే మంచి గుర్తింపు అందుకుంటున్నారు. స్టైల్ సినిమా తరువాత ‘పెళ్లి గోల’ వెబ్ సిరీస్ లో చేసిన ఆయన నిఖిల్ సిద్ధార్థ్ ‘అంకిత్ నిక్కీ అండ్ ఫ్రెండ్స్’ సినిమాలో నటించారు. ఇక విజయ్ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ లో నటించిజ అయన తాజాగా విజయ్ కొత్త సినిమాలో కూడ చేస్తున్నారు. ఇక బాలకృష్ణ గారితో ‘కథనాయకుడు’ సినిమాలో నటించిన ఆయన ‘వీర సింహారెడ్డి’ సినిమాలో కూడ నటించారు. ఇక ఆర్జివి అంటే ఎంతో ఇష్టముండే ఆయన లాక్ డౌన్ టైం లో వచ్చిన నగ్నం, కరోనా సినిమాల్లో నటించారు. తాజాగా పుష్ప 2 లో నటిస్తున్న ఆయన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ గురించి తాజాగా ఇంటర్వ్యూ లో మాట్లాడారు.

పుష్ప సినిమా కోసం బన్నీ చాలా కష్టపడ్డాడు… విజయ్ అలా మారిపోతాడని అనుకోలేదు…

పెళ్లి చూపులు సినిమాలో చేసే సమయంలో విజయ్ దేవరకొండ ఇంకా అప్ కమింగ్ హీరో. అపుడు ఆయనతో వర్క్ చేయడానికి ఇపుడు స్టార్ హీరో అయ్యాక వర్క్ చేయడానికి చాలా తేడా ఉందంటూ కేశవ దీపక్ మాట్లాడారు. ప్రస్తుత విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా గౌతమ్ తిన్ననురి సినిమాలో చేస్తున్న ఆయన అప్పటి విజయ్ కి ఇప్పటి విజయ్ కి చాలా తేడా ఉందంటూ చెప్పారు. తన వర్క్ డెడికేషన్ మారిపోయిందని కెమెరా ముందు ఎలా ఉండాలి నటనలో పరిణితి అన్ని చాలా పెరిగాయి.

ఇక ఆఫ్ స్క్రీన్ విజయ్ చాలా మంచి పర్సన్ అందుకే నాకు ఇంకా నచ్చుతాడు అంటూ చెప్పారు. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా రెండో భాగంలో నటిస్తున్న ఆయన సినిమాలో నా క్యారెక్టర్ ఎడిట్ లో పోతుందో ఉంటుందో తెలియదు కానీ ఆయన గొప్ప నటుడు అంటూ బన్నీ గురించి చెప్పారు. సినిమా షూటింగ్ అపుడు ఆయన కనిపించడు కేవలం పుష్ప రాజ్ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో ఆయన యాక్టింగ్ కి అసలు ఇంప్రెస్స్ అవకుండా ఉండలేము అంటూ కేశవ దీపక్ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago