Nagarjuna: బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం మూడవ సీజన్ నుంచి ఈయనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే నాగార్జున హోస్టింగ్ గురించి ఇదివరకే ఎన్నోసార్లు విమర్శలు వచ్చాయి .ఈయన మేకర్స్ ఏది రాసిస్తే అదే స్క్రిప్ట్ చదువుతారని అలా కాకుండా.. కంటెస్టెంట్ల పెర్ఫార్మెన్స్ చూసి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయాలను గుర్తించకుండా స్క్రిప్ట్ లో ఏది రాస్తే అదే మాట్లాడుతారని కామెంట్లు తరచూ వినపడుతూ ఉంటాయి.
ఈ విధంగా నాగార్జున గురించి ఇదివరకే ఎంతోమంది ఎన్నో విమర్శలు చేశారు. అయితే తాజాగా బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున హోస్టాగా పనికిరారు అంటూ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతు రాయల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. ఈ కార్యక్రమానికి ఈమె బజ్ యాంకర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ బిగ్ బాస్ కార్యక్రమంలో నాగార్జున స్క్రిప్ చదువుతారని ఈమె తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లను నాగార్జున అడగలేని ప్రశ్నలను తాను బజ్ కార్యక్రమంలో అడుగుతున్నాను అంటూ గీతు నాగార్జున యాంకరింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఆర్జీవి హోస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందంటూ ఈమె సలహాలు ఇచ్చారు. నాగార్జున ఎంత కూల్ గా వస్తారో కంటెస్టెంట్లతో మాట్లాడి అంతే కూల్ గా వెళ్తారు కానీ కంటెస్టెంట్ల బెండు తీయరని వారి స్క్రూలు టైట్ చేయరు అంటూ తన స్టైల్లో చెప్పారు.
హోస్ట్ గా వర్మ బెస్ట్…
ఇలా నాగార్జున స్టార్ డమ్ క్రేజ్ చూసి అది నిజం అని తెలిసిన చిన్న ఆర్టిస్టులు ఎవరు కూడా నాగార్జున గురించి అలాంటి వ్యాఖ్యలు చేయరు కానీ గీతూ అలాంటి వ్యాఖ్యలు చేసింది అంటే నిజంగానే ఈమె డేరింగ్ అనే చెప్పాలి. ఏది ఏమైనా నాగార్జున గురించి వచ్చే విమర్శలను ప్రస్తుతం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కూడా చెప్పడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…