Categories: FeaturedMovie News

Ashmitha Karnani : లగ్జరీ ఇల్లు చూపి ప్రేక్షకులను ఫిదా చేసినా సీరియల్ నటి..!

Ashmitha karnani : ఈ మధ్య హోమ్ టూర్ లు వ్లాగ్స్ అంటూ యూట్యూబ్ లో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు సినీ సెలబ్రిటీస్, సీరియల్ సెలబ్రిటీస్ తమ రోజువారి దినచర్యలను, వాళ్ళ ఇళ్లను వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో పెట్టేస్తుంటారు. ఇలాంటి వీడియోలను ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. వారికీ నచ్చిన టీవీ లేదా సినిమా సెలబ్రిటీలు ఎలా ఉన్నారో వారి వ్యక్తిగతంగా జీవితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి వారి అభిమానులు బాగా ఇష్టపడతారు. ఇక ఇలాంటి వీడియోలకు లక్షలలో వ్యూస్ వస్తుంటాయి.

ఇక ఇపుడు సీరియల్స్ సినిమాల్లో నటించిన అస్మిత అందరికి బాగా సుపరిచితమే. తనదైన నటనతో చాలా సీరియల్స్ లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అస్మిత, పెళ్లి చేసుకున్నాక తక్కువగా తెరపై కనిపించింది. 2020 లో ఇక బుల్లి తెరపై కానీ వెండి తెర పై కానీ కనిపించలేదు. మా టీవీ లో వచ్చిన ఇస్మార్ట్ జోడిలో చివరిసారిగా కనిపించింది. ఈటీవీలో వచ్చిన సీరియల్స్ తో ఫేమస్ అయిన అస్మిత ఆ తరువాత మా టీవీ లో వచ్చిన అగ్నిసాక్షి సీరియల్ లో విలన్ గా బాగా ఆకట్టుకుంది. ఇక యూట్యూబ్ లో ఛానెల్ మొదలు పెట్టి బ్యూటీ, డైట్ అలా అన్నిటికి సంబంధించిన వీడియోలతో బాగా ఫాలోయర్స్ ను పెంచుకున్న అస్మిత ఇటీవల తన హోమ్ టూర్ వీడియో చేసింది.

లగ్జరీ హోమ్ తో ఆశ్చర్య పరిచిన అస్మిత…..

అస్మిత ఇంటీరియర్ చాలా లగ్జరీ గా అందంగా ఉంది. మొత్తం ఇంటిని బ్లాక్ అండ్ వైట్ లో ప్లాన్ చేసుకున్నట్లు తెలిపింది. ఇక ఫర్నిచర్ కొనకుండా వారికి నచ్చిన డిజైన్ చేయించుకున్నట్లు వివరించింది. ఇక ఉన్న కొంచెం ప్లేసులో లోనే ఇంటిని అందంగా ఇంటీరియర్ చేయించుకున్నట్లు వెల్లడించింది. కొరియోగ్రాఫర్ సుధీర్ ని పెళ్లిచేసుకున్నాక అస్మిత తెర పై తక్కువగా కనిపిస్తున్నా యూట్యూబ్ ద్వారా మాత్రం అభిమానులను అలరిస్తోంది. ఇక ఇపుడు అస్మిత వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago