Ashiu Reddy : టిక్ టాక్ లతో బాగా ఫేమస్ అయ్యి జూనియర్ సమంతగా పేరుతెచ్చుకుంది అషు రెడ్డి. తరువాత బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వచ్చి సెలబ్రిటీగా మారిపోయింది. బిగ్ బాస్ తో వచ్చిన ఫేమ్ తో బుల్లితెర మీద బిజీగా మారిపోయింది. తరువాత ఓటీటీలో ప్రసారం అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొని ఇంకా పాపులర్ అయిపోయింది ఈ బోల్డ్ బ్యూటీ. అషు సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
ఏదైన సూటిగా మాట్లాడుతూ లేడీ రామ్ గోపాల వర్మ గా పేరు. బిగ్ బాస్ సీజన్ 3 తో అభిమానులను సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ 3 హౌస్ లో రాహుల్ సిప్లిగంజ్ తో అంత రిలేషన్ లేకపోయినా బయటకు వచ్చాక వీరి రిలేషన్ అందరిని అశ్చర్య పరిచింది. రాహుల్ హౌస్ లో పునర్నవి తో క్లోజ్ గా ఉన్నప్పటికీ బయటకు వచ్చాక అషు తో క్లోజ్ గా ఉండటంతో అందరూ షాక్ అయ్యారు. వీరిద్దరూ కలసి స్పెండ్ చేసిన ఫోటోలు షేర్ చేసేవారు. తరువాత కొన్నిరోజులకు ఎవరి దారి వారు చూసుకోవడంతో వీరి రిలేషన్ ఏంటో ఎవరికీ అర్థం కాలేదు.
ఒకరు నా ఫ్రెండ్, ఒకరు నా ఫ్యామిలీ……
అయితే తాజాగా ఈ కన్ఫ్యూషన్ కు తెర దించేసింది అషు. అషు ఒక సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అషూరెడ్డి మూవీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫేమ్ అజయ్‌తో కలసి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలావుండగా తాజాగా అషూ రెడ్డి అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ ఆస్క్ మీ సంథింగ్ సెషన్ నిర్వహించగా, ఆమెకు ఒక నేటిజన్ నుంచి రాహుల్ సిప్లింగజ్, అజయ్‌ని కంపేర్ చేస్తూ ఒక ప్రశ్న ఎదురైంది. అందుకు అషు రెడ్డి ఇద్దరితో ఉన్న ఫొటోలు షేర్ చేసి.. ఒకరు నా ఫ్రెండ్, మరొకరు నా ఫ్యామిలీ అని చెప్పింది. అయితే ఎవరు ఫ్యామిలీ, ఎవరు ఫ్రెండ్ అన్న క్లారిటీ ఇవ్వలేదు. అయితే నెటిజన్లు మాత్రం రాహుల్ ని తన ఫ్యామిలీ అని చెప్పకనే చెప్పింది అని కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…