Ashu Reddy: బిగ్ బాస్ కార్యక్రమంలో లేడీ కంటెస్టెంట్ సిగరెట్ తాగడం కొత్తేమీ కాదు. సీజన్ 1 నుంచి ఈ సిగరెట్ తాగడం కొనసాగుతూ వస్తోంది.ఇక తాజాగా ఈ కార్యక్రమం బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో 24 గంటల పాటు ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో భాగంగా ఆశు రెడ్డి బాత్రూంలో స్మోక్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.
ఈ క్రమంలోనే ఈమెపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా స్మోకింగ్ జోన్ లో లైటర్ దొంగతనం చేసే బాత్రూంలోకి వెళ్లి రహస్యంగా సిగరెట్ తాగి అనంతరం ఫ్రెష్ నర్ వేసుకొని బయటకు వచ్చారు. అయితే ఆశు రెడ్డి బాత్రూంలో స్మోక్ చేస్తుండగా బయట నట రాజ్ మాస్టర్, బాబా మాస్టర్ ఉన్నారు.
ఇక అఖిల్ స్మోకింగ్ స్మెల్ రాకుండా రూమ్ మొత్తం స్ప్రే చేస్తూ తనకు హెల్ప్ చేశారు.ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఆశు రెడ్డిని దారుణంగా ఏకిపారేస్తున్నారు. గత వారం శివ బాత్రూంలో సిగరెట్ తాగడంతో ఆశు రెడ్డితీవ్ర స్థాయిలో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈ వారం నువ్వు చేసింది ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
సిగరెట్ తాగే అలవాటు ఉంటే ధైర్యంగా స్మోక్ జోన్ కి వెళ్లి తాగచ్చు కదా, ఇలా బాత్రూంలో సిగరెట్ తాగడం ఏంటి? అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలా వేరే వాళ్ళని కామెంట్ చేసేటప్పుడు మనం మన పరిస్థితిని అంచనా వేసుకోవాలి ఉంటుందని నెటిజన్లు ఈమె వ్యవహారశైలిపై ఫైర్ అవుతున్నారు. మొత్తానికి సిగరెట్ తాగడంతో ఆశు రెడ్డి పై నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…