Featured

Astrologer Venu Swamy : మెగా వారసురాలి జాతకం ఎలా ఉండనుంది… మెగా వంశంలో ఏం జరగబోతుందంటే…: ఆస్ట్రాలజర్ వేణు స్వామి

Astrologer Venu Swamy : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మెగా కోడలు ఉపాసనకు జూన్ 20 న కూతురు పుట్టింది. పాప పుట్టగానే అటు మెగా ఫ్యామిలీ లోనూ ఇటు మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. నిన్నటినుండి సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. మంగళవారం నాడు మా ఇంటికి లక్ష్మి దేవి వచ్చిందంటూ చిరంజీవి గారు మానవరాలి గురించి చెబుతూ ఆనందపడిపోయారు. అయితే ఇపుడున్న సోషల్ మీడియా ఎవరినీ వదలదు. ఇన్నిరోజులు మెగా ఇంట్లో వారసులు రాలేదని రామ్ చరణ్, ఉపాసన లను ట్రోల్ చేసారు. ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయ్యాక ఆమె గర్భవతి అయినా కడుపు కనిపించడం లేదు అంటూ సరోగసీ అంటూ ఏవేవో మాట్లాడారు. తాజాగా పుట్టిన పసిపాపను కూడా వదలడం లేదు. రోజూ పాప జాతకం అంటూ మెగా వంశాన్ని పాప జాతకం ఎలా మార్చబోతోంది అంటూ హడావిడి చేస్తున్నారు. తాజాగా సెలబ్రిటీల ఆస్ట్రాలజర్ గా చెప్పుకునే వేణుస్వామి మెగా వారసురాలి జాతకం చెప్పారు.

మెగా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది…

రామ్ చరణ్, ఉపాసన గారికి మంగళవారం నాడు పండంటి పాప పుట్టింది. పాప పుట్టిన నక్షత్రం పునర్వసు కాగా మంగళవారం నాడు గురు ఛండాల యోగంలో పుట్టడం వల్ల పాప మెగా ఇంటికి రాజయోగం తెస్తుందని నిజంగానే మెగా ఇంటికి లక్ష్మి దేవి వచ్చిందంటూ చెప్పారు. రామ్ చరణ్ రోహిణి నక్షత్రంలో జన్మించిగా ఉపాసన కృతిక నక్షత్రం కాగా పాప పునర్వసులో జన్మించింది.

రోహిణి నక్షత్రం కృష్ణుడు, కృతిక అమ్మవారి నక్షత్రం కాగా పాప పునర్వసు నక్షత్రం రాముడి నక్షత్రం ఇలా మూడూ దేవునికి సంబంధించిన నక్షత్రాలే అంటూ చెప్పారు. పాప గురు ఛండాల యోగంలో పుట్టడం వల్ల మరో బిడ్డ రామ్ చరణ్ దంపతులకు ఉండకపోవచ్చు. మెగా ఇంట వారసుడు ఉండకపోవచ్చు అంటూ వేణుస్వామి చెప్పారు. ఇక పాపకి చిన్న చిన్న పంటికి సంబంధిచిన ఆరోగ్య సమస్యలు వస్తాయి అంతే మంచి రాజయోగ జాతకురాలు అంటూ వేణుస్వామి చెప్పారు.

Bhargavi

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

20 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

20 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

20 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

20 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

20 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

20 hours ago