Aswini Dutt: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెరికెక్కిన సినిమాలకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అత్యుత్తమమైన నంది అవార్డుల గురించి తరచూ ఏదో ఒక వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటీనటులకు నంది అవార్డులను ప్రకటించేవారు అయితే ఎప్పుడైతే ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిందో అప్పటి నుంచి రెండు ప్రభుత్వాల నుంచినంది అవార్డుల ప్రస్తావన రాలేదు. అయితే తాజాగా నంది అవార్డుల గురించి నిర్మాత అశ్విని దత్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాజాగా మీడియా సమావేశంలో భాగంగా దివంగత నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు నిర్మాత అశ్విని దత్ వంటి వారు పాల్గొన్నారు. ప్రేక్షకుల కోరిక మేరకు కృష్ణా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాని మే 31వ తేదీ తిరిగి విడుదల చేస్తున్నామంటూ ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు మీడియా సమావేశంలో తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అశ్వినీ దత్ నంది అవార్డుల గురించి మాట్లాడారు గతంలో సెలబ్రిటీల కష్టాన్ని గుర్తించి అవార్డులు ఇచ్చేవారు ఇలా నంది అవార్డులు తీసుకోవడం సెలబ్రిటీలు కూడా ఎంతో గౌరవంగా భావించారు. అయితే ప్రస్తుతం నంది అవార్డుల ప్రస్తావన మాత్రం లేదని,ప్రస్తుతం నడుస్తున్న సీజన్ వేరు కదా ప్రస్తుతం ఉత్తమ రౌడీ ఉత్తమ గుండా అవార్డులను ఇస్తున్నారని తెలిపారు.
మరో రెండు మూడు సంవత్సరాలలో ఘనంగా అవార్డులు ఇచ్చే రోజులు వస్తాయని అంతవరకు ఎదురు చూద్దామంటూ ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ అశ్వినీ దత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇలా అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే ఈసారి ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురవుతుందని ఈయన పరోక్షంగా కామెంట్లు చేశారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…