Vanitha Vijaykumar: వనిత విజయ్ కుమార్ పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో ప్రముఖ నటీనటులైన మంజుల విజయ్ కుమార్ కూతురుగా వనిత అందరికీ సుపరిచితమే ఈమె కూడా ఇండస్ట్రీలో తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించారు. అయితే వనిత సినిమాలలో నటించి పేరు సంపాదించడం కన్నా తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలిచారు.
ఒకటి కాదు రెండు కాదని ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చిన ఘనత వనితాకే చెల్లుతుంది. అయితే శనివారం తన మూడవ భర్త పీటర్ పాల్ గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే. ఇలా తన మాజీ భర్త గుండెపోటుకు గురవడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా ఆయన మరణం పట్ల స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
కొద్దిరోజులుగా గుండెపోటుతో చెన్నైలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి పీటర్ శనివారం మరణించారు. ఈ క్రమంలోనే వనిత తన మాజీ భర్త మరణం పై స్పందిస్తూ…ఇతరులకు సహాయం చేసే వారికి ఎప్పుడు దేవుడు సహాయం చేస్తారని మా అమ్మ నేర్పింది అయితే ఇది అందరూ నేర్చుకోవాల్సిన విషయం.ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు మనకు మనమే నిర్ణయాలు తీసుకోవాలి ఆసుపత్రిలో నువ్వు ఉన్నప్పుడు దయ్యాలతో పోరాటం చేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు.
నీ మరణం నన్ను బాధ పెట్టినప్పటికీ నీకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటున్నాను.ఎట్టకేలకు నువ్వు ప్రశాంతతను సాధించి ఒక సరైన ప్రదేశంలో ఉంటావని అనుకుంటున్నాను… నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండు అంటూ ఈ సందర్భంగా వనిత తన మాజీ భర్త మరణం పై చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఈయనని మూడవ వివాహం చేసుకున్న వనిత ఇతనితో పెళ్లయిన నాలుగు నెలలకే విడాకులు తీసుకుని విడిపోయారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…