Movie News

Posani Krishna Murali: ఉత్తమ వెన్నుపోటుదారు అవార్డు ఇవ్వాలి…అశ్వినీ దత్ కి కౌంటర్ ఇచ్చిన పోసాని!

Posani Krishna Murali: ఏపీలో నంది అవార్డుల గురించి నిర్మాత అశ్వినీ దత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉత్తమ గుండా, ఉత్తమ రౌడీ అంటూ నంది అవార్డులు ఇవ్వాలి అని ఏపీ ప్రభుత్వం గురించి ఇన్ డైరెక్ట్ గా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి ఇటీవల స్పందించాడు. ఈ క్రమంలో తాజాగా మీడియా ముందుకి వచ్చిన కృష్ణ మురళి అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..”

ఉత్తమ గుండా ఉత్తమ రౌడీ అని కాదు ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ మోసగాడు, ఉత్తమ వెధవలు, ఉత్తమ సన్నాసులు అనే బిరుదులు మీకే ఇవ్వాలి అని చురకలంటించాడు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో నంది అవార్డుల ప్రధానోత్సవం జరగలేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా విజృంభించింది ఆ సమయంలో ప్రజలను కాపాడుకోవడమే కాకుండా ఆ తర్వాత దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ఇస్తున్నాడు.

ఎందుకు మీరంతా జగన్ మీద పడి ఏడుస్తున్నారు. ఆయన మీకు ఏం అన్యాయం చేశాడు. చంద్రబాబు లాగా వెన్నుపోటు పొడిచి ఎవరికైనా అన్యాయం చేశాడా అని పోసాని ప్రశ్నించాడు. జగన్ ఎవరికైనా అన్యాయం చేసినట్లు నిరూపిస్తే నీ కాళ్లు మొక్కుతా అంటూ పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ ని చెప్పులతో కొట్టించినప్పుడు మాట్లాడకుండా ఏం చేశావు అంటూ అశ్విని దత్ ని పోసాని ప్రశ్నించాడు.

Posani Krishna Murali: అవార్డులు ఇస్తే ఎవరు పేరు పెట్టని విధంగా ఇస్తారు.

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా కారణంగా నంది అవార్డులు ఇవ్వలేదన్నమాట వాస్తవమే కానీ. జగన్ నంది అవార్డులు ఇస్తే ఎవరు పేరు పెట్టని విధంగా ఉంటుంది అంటూ పోసాని చెప్పుకొచ్చాడు. చంద్రబాబు గురించి పొగడటానికి చెన్నై నుండి రజనీకాంత్ విజయవాడకు వచ్చిన మాకు అభ్యంతరం లేదు. మాకు మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు మెగాస్టార్ అంటే జగన్ కి ఎంతో అభిమానం అంటూ పోసాని కౌంటర్లు వేశాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago