డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆకాష్ పూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ కేతిక శర్మ జంటగా రొమాంటిక్ చిత్రం అక్టోబర్ 29వ తేదీన విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోగా నటించిన ఆకాష్ పూరి ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో భాగంగా ఆకాష్ తన తండ్రి గురించి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే తను మాట్లాడిన మాటలు విని చాలా మంది తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏంటి ఆకాశ్ అంత పెద్దవాడయ్యాడు అలా మాట్లాడాడు ఏంటి అని అడగడంతో అమ్మ నాన్న ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పారు.
ఇక ఈ సినిమాలో ఆకాష్ వాస్కోడిగామా పాత్రలో నటిస్తున్నారని, ఒక చంటిగాడు, బుజ్జిగాడు,పండుగాడు పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో వాస్కోడిగామా పాత్ర కూడా అలాగే ఉండిపోతుందని ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్ర గురించి ఆకాష్ తెలియజేశారు.అనిల్ ఈ సినిమా తన మొదటి సినిమాగా తీయలేదని ప్రతి సన్నివేశాన్ని ఎంతో క్లారిటీగా తీశారని ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఎంతో అద్భుతంగా నచ్చుతుందని ఆకాష్ తెలియజేశారు.
అయితే ఇందులో రమ్యకృష్ణ పాత్ర ఎంతో ప్రధానమైనది. ఆమెతో కలిసి నటించడానికి కాస్త ఇబ్బంది పడ్డాను. అయినా రమ్య కృష్ణ గారు నవ్వుతూ పర్లేదు కాస్త టైం తీసుకో అంటూ తనని ప్రోత్సహించిందని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో రొమాన్స్ కాస్త ఎక్కువగా ఉందని ఈ విషయమే నాన్న సినిమాలో రొమాన్స్ కాస్త తగ్గించు అని తన తండ్రితో చెప్పడంతో సినిమానే రొమాంటిక్ రొమాన్స్ తగ్గించమంటావ్ ఏంట్రా అంటూ తన తండ్రి చెప్పినట్లు ఆకాష్ తెలియజేశారు.అయితే అలా అందరి ముందు రొమాన్స్ చేయడానికి భయం వేసిందని ఆ సమయంలో పారిపోవాలనిపించిందని ఈ సందర్భంగా ఆకాష్ పూరి రొమాంటిక్ చిత్రం గురించి వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…