Athadu Movie: సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఘటనలు వింటూ ఉంటాం.. ఈ సినిమా ఓ హీరో చేయాల్సింది మరెవరో చెశారు అని. అయితే వద్దు అనుకున్న సినిమాలు ఆ డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ వేరే హీరోను తీసుకొని చేస్తే.. ఆ సినిమా హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి.. ఫట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ కోవకు సంబంధించింది ఓ విషయం గురించి ఇక్కడ మనం చర్చించుకుందాం..
సూపర్ స్టార్ మహష్ బాబు ఒక హీరోగా ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకున్న సినిమాల్లో ఎక్కువగా మనం చెప్పే సినిమాలు రెండు అందులో ఒక్కడు, అతడు. ఈ రెండు సినిమాలో అతడి కెరీర్ ను కీలక మలుపు తిప్పాయి. ఎన్నో సెంటర్లలో 100 రోజులు ఆడి.. బంపర్ మెజారిటీతో హిట్ కొట్టాయి. అంతడు సినిమాను రూ.24 కోట్లతో తెరకెక్కించగా.. థియేట్రికల్ బిజినెస్ కు రూ.16.5 కోట్లు వస్తే.. రూ.17.5 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమా క్యాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచిందనే చెప్పాలి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ అతడు సినిమాను మొదట మహేష్ బాబు హీరోగా అనేకోలేదట. దానిని మొదట యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ను అనుకున్నారట. నువ్వు నేను సినిమాతో మంచి ఊపు మీదున్న ఉదయ్ కిరణ్.. అతడికి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఇక దీనిని జయభేరీ ఆర్ట్స్ లో చేయాలని అనుకొని.. త్రివిక్రమ్, ఉదయ్ కిరణ్ కూడా అడ్వాన్స్ ఎమౌంట్ కూడా తీసుకున్నారట. కానీ షూటింగ్ టైంకు డేట్స్ కుదరకపోవడంతో.. ఉదయ్ కిరణ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లగా.. అతడు ఆ సమయంలో పడుకొని ఉండటంతో.. కథ వినిపించేందుకు కుదరలేదు. దీంతో అక్కడ నుంచి మహేష్ బాబు దగ్గరకు వెళ్లింది. ఈ కథ విన్న వెంటనే సిగ్నల్ ఇచ్చేరట మహేష్ బాబు. ఇలా తెరమీదకు వచ్చింది అతడు సినిమా. ముందుగా పద్మాలయ బ్యానర్ పై చేయాలని మహేష్ అనుకున్నా.. జయభేరీ ఆర్ట్స్ కు త్రివిక్రమ్ కమిట్ అవ్వడంతో.. ఈ బ్యానర్ లోనే తీశారు. ఇక ఈ సినిమాను మా టీవీ రూ.7 కోట్లకు రెన్యూవల్ చేసుకుందట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…