పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం రేపిన యువతి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. మొదట ఆత్మహత్యగా భావించిన ఈ ఘటనను పోలీసులు లోతుగా విచారించగా, ఇది పరువు హత్యగా వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రే తన కుమార్తెను హత్య చేసినట్లు తేలడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
మాచర్లకు చెందిన వ్యాపారి చంద్రశీను కుమార్తె చౌడేశ్వరి (22) అదే ప్రాంతానికి చెందిన యువకుడు నాగరాజుతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులు ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో నిశ్చితార్థానికి కొద్ది రోజుల ముందు చౌడేశ్వరి తన ప్రేమికుడితో వెళ్లి వివాహం చేసుకుంది.
ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి చంద్రశీను, తన కుమార్తెపై కోపంతో వ్యవహరించినట్లు సమాచారం. ఆమె కుటుంబ పరువు తీసిందని భావించి మొదట పోలీసులకు నగలు దొంగతనం చేశిందని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం విచారణలో ఆమె తన స్వచ్ఛందంగా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడైంది.
ఇక పెద్దల మధ్య జరిగిన చర్చల తర్వాత, మార్చి 19న చౌడేశ్వరి భర్త వద్దకు వెళ్లేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అయితే ఆ ఒప్పందానికి ముందే మార్చి 18న ఆమె అనుమానాస్పదంగా మృతి చెందింది. మొదట దీనిని ఆత్మహత్యగా భావించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికతో కేసు మలుపు తిరిగింది.
పోస్టుమార్టం నివేదికలో ఇది ఆత్మహత్య కాదని స్పష్టమవడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో తండ్రి చంద్రశీను అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆయన సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
పోలీసుల వివరాల ప్రకారం, మార్చి 18న ఇంట్లో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లిన సమయంలో నిద్రిస్తున్న కుమార్తెను తాను, తన మేనల్లుడు కలిసి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అనంతరం ఘటనను ఆత్మహత్యగా చూపించేందుకు ప్రయత్నించినట్లు కూడా ఒప్పుకున్నాడు.
తన కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం పరువు తక్కువగా భావించి ఈ దారుణానికి పాల్పడ్డానని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
ప్రేమ వివాహం పేరుతో ఇలాంటి దారుణం చోటుచేసుకోవడం స్థానికులను షాక్‌కు గురి చేసింది. పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…