భూమిపై క్రూర జంతువులు ఎలా ఉంటాయో ఆ సముద్రంలో కూడా అదేవిధంగా క్రూర జంతువులు ఉంటాయి. సముద్రంలో సొర చేపలు ఎంతో క్రూరమైనవి. వీటి చేతికి గాని మనం దొరికామంటే ఇక మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఒక్కసారిగా మనుషుల్ని చీల్చి చెండాడే సామర్థ్యం సొర చేపలకు ఉంటుంది. అయితే ఇంతటి భయంకరమైన సొరచేపలు నుంచి ప్రాణాలతో బయటపడటం అంటే అది నిజంగా మన అదృష్టం అని చెప్పవచ్చు. మరి ఇలాంటి అదృష్టం ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తికి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
మాట్ వుడ్ అనే ఒక డ్రోన్ పైలట్ ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ బోండి బీచ్ కి వెళ్లి బాల్కనీలో కూర్చుని డోన్ సముద్రంపై ఎగరేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని కంటికి ఒక ఆశ్చర్యకరమైన ఘటన కనిపించింది. సముద్రంలో ఒక వ్యక్తి సొర చేపకు దొరికి దానితో తీవ్రంగా పోరాడుతున్నట్లు గుర్తించాడు. ఈ క్రమంలోనే మాట్ వుడ్ తన ప్రియురాలితో కలిసి లోకల్ లైఫ్‌గార్డ్ కి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న లోకల్ లైఫ్ గార్డ్ రంగంలోకి దిగారు. ఈక్రమంలోనే డ్రోన్ కెమెరా ఆధారంగా ఆ వ్యక్తి ఉన్న లొకేషన్ గుర్తించి జెట్ స్కై పై ఒక ఈతగాన్ని సముద్రంలోకి పంపారు. ఈతగాడు ఆ వ్యక్తి దగ్గరకు చేరుకోవడానికి సుమారు 30 నిమిషాలు సమయం పట్టింది. అప్పటికే ఆ వ్యక్తి సొరచేపతో ఎంతో తీవ్రంగా పోరాడుతున్నాడు.
ఈ క్రమంలోనే అతను అక్కడికి చేరుకునేలోపు ఆ వ్యక్తి సొరచేపతో పోరాడి ఒడ్డుకు చేరుకున్నాడు.. ఈక్రమంలోనే లైఫ్ గార్డ్ అతనిని జెట్ స్కై పైకి తీసుకొని సురక్షితంగా బీచ్ కి తీసుకువచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మాట్ వుడ్ రికార్డు చేయగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…