అవికాగోర్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది చిన్నారి పెళ్లికూతురు సీరియల్. అప్పట్లో సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఎంతో క్యూట్ గా నటించిన అవికాగోర్ మెల్లగా తన అడుగులను వెండితెర వైపు వేసి అక్కడ కూడా తన నటన ద్వారా ఎంతో మందిని ఆకర్షించింది. హిందీ లో పలు సీరియల్ లో నటించిన అవికాగోర్ ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.
ఉయ్యాల జంపాల సినిమా హిట్ అవడంతో వరుసగా లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మామ, రాజు గారి గది 3 లో తనదైన శైలిలో ఎంతో అద్భుతంగా నటించారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు ఎంతో బొద్దుగా, లాగా ఉన్న అవికా గోర్ సినిమాలకు దూరంగా ఉండి తన శరీరంపై కాస్త శ్రద్ద పెట్టింది.ఎంతో వర్క్ ఔట్ చేసి తన శరీరాకృతిని మార్చుకుని ఇప్పుడు ఎంతో నాజూకుగా, అందంగా కనిపిస్తుంది.
అటు టాలీవుడ్ లోనూ, ఇటు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు పొందిన అవికాగోర్ ప్రస్తుతం ప్రేమలో పడిందని తానే స్వయంగా తెలియజేశారు.మిలింద్ చద్వానీ అనే వ్యక్తితో అవికా గోర్ ప్రేమ లో ఉన్నట్టు తన లవర్ ని పరిచయం చేశారు. అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ గురించి తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం అవికా గోర్ మిలింద్ చద్వానీ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మనల్ని అర్థం చేసుకునే, మన అభివృద్ధిలో సాయపడే వ్యక్తి, మనల్ని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి మన జీవితం లోకి రావాలని ప్రతి ఒక్కరు ఆశపడుతుంటారు. అచ్చం అలాంటి వ్యక్తి నా జీవితంలో లోకి వచ్చాడని ఈమె తెలిపారు. నా జీవితంలోకి మిలింద్ చద్వానీ రావడం ఎంతో అదృష్టమని, తను నా జీవితాన్ని పరిపూర్ణం చేసినందుకు అతనికి థాంక్స్ చెబుతూ, వారిద్దరూ బీచ్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ, వీరు ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం తమకు లేదని అవికా గోర్ తెలియజేశారు. అయితే ప్రస్తుతం అవికాగోర్ ఎంతో స్లిమ్ గా మరి నాజూగ్గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…