Avika Gor: చిన్నారి పెళ్లికూతురు అనే బుల్లితెర సీరియల్ ద్వారా బాలనటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి అవికా గోర్. ఇలా బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈమె అనంతరం రాజ్ తరుణ్ సరసన ఉయ్యాల జంపాల సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం పలు సినిమాలలో నటించి నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.
సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది అయితే బాలీవుడ్ లో అవకాశాలు పొందడం కోసం సౌత్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అవికా గోర్ మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో కన్నా సౌత్ ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువగా ఉందంటూ ఈమె కామెంట్స్ చేశారు. స్టార్ హీరోల పవర్ మీదనే సౌత్ ఇండస్ట్రీ మొత్తం నడుస్తుందనీ, బాలీవుడ్ తో పోలిస్తే కాస్త సౌత్ లోనే నెపోటిజం ఎక్కువగా ఉందంటూ తెలియజేశారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే అక్కడ బందు ప్రీతి ఎక్కువగా ఉందని బహుశా రాబోయే రోజుల్లో అది కూడా కనిపించకపోవచ్చు అంటూ ఈమె కామెంట్ చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలపై నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేవలం బాలీవుడ్ అవకాశాల కోసం సౌత్లో సక్సెస్ సాధించి డబ్బులు సంపాదించుకొని ఇలా సౌత్ ఇండస్ట్రీపై విమర్శలు చేయడం సరికాదు అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…