Featured

Ayyappa Sharma : చిరంజీవి వల్లే ఈరోజు ఇండస్ట్రీలో మా ఫ్యామిలీ ఉంది…: అయ్యప్ప శర్మ

Ayyappa Sharma : తెలుగు, కన్నడ, తమిళం ఇలా అన్ని ఇండస్ట్రీలలోనూ సినిమాలను చేస్తూ అన్ని భాషలలోనూ గుర్తింపు తెచ్చికున్న నటుడు సాయి కుమార్. ఆయన తండ్రి నటుడే, ఆయన తమ్ముళ్లు అలాగే కొడుకు కూడా నటులే. ఇలా ఇంతమంది నటులుగా ఉన్న ఈ కుటుంబానికి మెగాస్టార్ ఎంతో మేలు చేసాడంటూ సాయికుమార్ గారి తమ్ముడు అయ్యప్ప శర్మ వివరించారు. కేజీఎఫ్ సినిమా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న అయ్యప్ప శర్మ మెగాస్టార్ గారి గొప్పతనంను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఆ సినిమా విడుదల కాకుంటే ఏమైయ్యుండేదో…

పీజే శర్మ గారితో మొదలు సాయి కుమార్, రవిశంకర్ అలానే అయ్యప్ప శర్మ అలాగే సాయి కుమార్ తనయుడు ఆది వీళ్లలందరూ కూడా కంచు కంఠానికి ఫేమస్. ఇక సినిమాలో సాయి కుమార్ డైలాగులకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా పోలీసుల పాత్రల్లో సాయి కుమార్ నటన ఒక ఎత్తు ఆ వాయిస్ తో చెప్పే డైలాగకు మరో ఎత్తు. అయితే సాయి కుమార్ నటించిన ‘పోలీస్ స్టోరి’ సినిమాను తెలుగులో విడుదల చేసే సమయంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన సహాయం మర్చిపోలేమని మా కుటుంబం నేటికీ అందుకు కృతజ్ఞతగా ఉంటుందంటూ తెలిపారు.

అప్పట్లో ట్రైలర్స్ ఇవన్నీ ఉండేవి కాదు అయితే సినిమాను మొదట చూసి చిరంజీవి గారు సురేఖ గారు సినిమా బాగుందని చెప్పారన్నారు. వాళ్ళే అందరికీ సినిమా బాగుంది తీసుకోమ్మని చెప్పడం అలా బిజినెస్ జరిగి అలానే సినిమాకు యాడ్స్ ఇచ్చినపుడు చిరంజీవి గారు చెప్పిన మాటలను, అలాగే దాసరిగారు వంటి వారి మాటలను జోడించి పబ్లిసిటీ చేయడంతో సినిమా విడుదల అయ్యాక మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటూ చెప్పారు. మెగాస్టార్ చెప్పారు కాబట్టే జనాలు కూడా సినిమాను చూసారని అయ్యప్ప శర్మ అభిప్రాయాపడ్డారు.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

4 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

5 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

6 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

7 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

7 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

7 hours ago