General News

Bigg Boss 7: బిగ్ బాస్ ప్లాన్ మామూలుగా లేదు… ఈసారి మాజీ కపుల్స్ ను హౌస్ లోకి పంపిస్తున్న మేకర్స్!

Bigg Boss 7: బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే తెలుగులో ఈ కార్యక్రమం 6 సీజన్లను పూర్తిచేసుకుని ఏడవ సీజన్ ప్రసారం అవ్వడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది మునుపటిలా కాకుండా ఈ సీజన్ మరింత ఎంటర్టైనింగ్ గా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ కార్యక్రమంలోకి యాంకర్ రష్మీ వెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ కార్యక్రమం గురించి మరో వార్త వైరల్ గా మారింది. గత కొన్ని సీజన్లో నుంచి బిగ్ బాస్ కార్యక్రమంలోకి సెలబ్రిటీ కపుల్స్ నుపంపిస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈసారి మాత్రం అందుకు కాస్త భిన్నంగా మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈసారి సెలబ్రెటీ కపుల్స్ కాకుండా మాజీ సెలబ్రిటీ కపుల్స్ ను పంపించాలనే ఆలోచనలో బిగ్ బాస్ ఉన్నట్టు సమాచారం. సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నోయల్ నటి ఎస్తర్ నుప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే అయితే పెళ్లయిన కొన్ని నెలలకే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన ఈ జంటను ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి పంపించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.

Bigg Boss 7: నోయల్…ఎస్తర్ ఒప్పుకుంటారా…

ఇక నోయల్ విడాకులు ఆయన వెంటనే బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లిన విషయం మనకు తెలిసిందే. అయితే సీజన్ సెవెన్ లో మరోసారి ఈ మాజీ దంపతులను పంపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే ఇందుకు నోయల్ ఎస్తర్ ఒప్పుకుంటారా అనే సందేహాలు కూడా వెలబడుతున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

29 minutes ago

ఫోన్‌తో టాయిలెట్‌లో గడిపితే… మీ శరీరం చెల్లించాల్సిన ధర ఇదే!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…

30 minutes ago

టాలీవుడ్‌కు ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ హాట్ టాపిక్

తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…

34 minutes ago

కేరళ సీఎంకు లేఖ.. మోనాలిసా కేసులో కొత్త ట్విస్ట్

‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…

37 minutes ago

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…

60 minutes ago

భారత ఆధ్యాత్మికతను మార్చిన ఇద్దరు మహానుభావులు! అద్వైతం, విశిష్టాద్వైతం.. అసలు తేడా ఏమిటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…

1 hour ago