Categories: FeaturedMovie News

Babu Mohan : నన్ను విషం పెట్టి చంపేయాలని చూసారు : బాబు మోహన్

Babu Mohan : ‘ఆహుతి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబు మోహన్ ఆ తరువాత వచ్చిన మామగారు సినిమాతో కమెడియన్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక అనేక సినిమాల్లో కోటా శ్రీనివాస్ రావు గారి పెయిర్ గా కామెడీ పండించిన బాబు మోహన్ మరి కొన్ని సినిమాల్లో బ్రహ్మానందం జోడిగా కూడా మంచి కామెడీ అందించారు. టీడీపీ తరపున ఎన్టీఆర్ కోరిక మేరకు ప్రచారం చేసిన బాబు మోహన్ ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఇక టీడీపీ హయాంలోనే రెండోసారి గెలిచి మినిస్టర్ అయ్యారు. ఇక తెలంగాణ ఏర్పడ్డాక తెరాస లో చేరిన బాబు మోహన్ ప్రస్తుతం బీజేపీ లో ఉన్నారు.

విషం పెట్టి చంపాలనుకున్నారు…

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాబు మోహన్ తనకు విషం పెట్టి చంపాలనుకున్న విషయాన్ని తెలిపి షాక్ కి గురిచేసారు. తనికెళ్ళ భరణి గారి వల్ల పాన్ బీడా తినడం అలవాటైంది. రోజుకి 30 దాకా పాన్లు తినే వాడిని అంతలా పాన్ కి బానిసయ్యను. ఇక హైదరాబాద్ రావాలంటే మెదక్ నుండి సంగారెడ్డి మీదుగా వచ్చేవాడిని, ఆ సమయంలో ఒక పాన్ షాప్ దగ్గర పాన్ కట్టించుకుని వెళ్తుండడం అలవాటు. అలా ఒక రోజు కట్టించుకుని కొంత దూరం వెళ్ళాక తినాలనిపించి పాన్ డబ్బా తెరిచేలోగా పాన్ షాప్ అతను ఫోన్ చేసి తినొద్దని, అందులో విషం ఉందని చెప్పి పెట్టేసాడు. ఇక మళ్ళీ అతని భార్య ఫోన్ చేసి బాగా ఒత్తిడి చేసి ఇలా చేయమన్నారు అంటూ ఏడ్చి చెప్పింది. ఆరోజున అర్థమైంది రాజకీయాలు ఇంత ఉంటాయా అని అంటూ వివరించారు.

ఇక పాన్ ను ఎలా మానేసారు అని కూడా చెప్పారు. సెంట్రల్ మినిస్టర్ తో మీటింగులో చంద్రబాబు నాయుడు గారితో ఉన్నపుడు వచ్చిన కేంద్ర మంత్రి బీడా తింటున్నారు. ఇక నేను ఊరికే ఉంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను తిను పర్వాలేదు అన్నట్లు గా సైగ చేసారు కానీ నాకు ఆయన ముందు అలా తినాలని అనిపించలేదు. ఇక ఆతరువాత మెల్లగా ఆ అలవాటును మానేసాను అంటూ చెప్పారు. టీడీపీ నుండి తెరాస ఆ తరువాత ఇప్పుడు బీజేపీ లో ఉండటం గురించి మాట్లాడారు. టీడీపీ, బీజేపీ రెండూ ఒకే పార్టీనే. నా దృష్టిలో రెండూ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు, తెలంగాణ రాక ముందు వరకు రెండూ కలిసే ఉన్నాయి. ఇక తెరాస లో ఉన్న వాళ్లంతా టీడీపీ లో నాతో కలిసి పనిచేసిన వాళ్ళే, ఇవన్నీ వేరే పార్టీలు ఎలా అవుతాయి. కాంగ్రెస్ మాత్రమే వేరే పార్టీ అంటూ వివరించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago