Babu Mohan: తెలుగు సినిమా చరిత్రలో టాప్ కమెడియన్లలో ఖచ్చితంగా ఉండే పేరు బాబూ మోహన్. తనదైన మ్యానరిజంతో చాలా సినిమాల్లో కామెడీని పండించారు. కోట శ్రీనివాస్ రావు, బాబు మోహన్ జోడీ చాలా సినిమాల్లో సూపర్ సక్సెస్ అయింది. వీరిద్దరి కామెడీతో నిడిచిన సినిమాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక బాబూ మోహన్ కామెడీకి సపరేట్ ఫ్యాన్స్ ఉండేవారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్నారు బాబు మోహన్. గతంలో కమెడియన్, కొన్ని సినిమాల్లో హీరోగా రాణించిన బాబు మోహన్.. నటనకు దూరంగా ఉంటూ… రాజకీయాల్లో ఉన్నారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి గతంలో పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి కూడా చేపట్టారు.
2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. ఆ తరువాత టికెట్ నిరాకరించడంతో బీజేపీ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు.
అయితే తాజాగా ఓ ఛానెల్ నిర్వహించిన కామెడీ షోలో ఆయన పాల్గొని అలరించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన కుమారుడిని తలచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడు మృతి చెందిన విషయాన్ని చాలా కాలంపాటు జీర్ణించుకోలేకపోయానని, ఆ సమయంలో అస్తిపంజరంగా మారిపోయానని బాబుమోహన్ చెప్పుకొచ్చారు. ఒకనొక దశలో చనిపోవాలని అనుకున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు . కొన్నేళ్ల క్రితం బాబూమోహన్ ఏకైక కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…