Featured

Baby cinema director Sai Rajesh : ఆనంద్ తో రోజూ రెండు పెగ్గులు వేయించా… నిజంగానే కొట్టించా…: బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్

Baby Cinema director Sai Rajesh : హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, కలర్ ఫోటో వంటి మూడు సినిమాల తరువాత నాలుగో సినిమాగా ‘బేబీ’ సినిమాను రూపొందించిన సాయి రాజేష్ బేబీ సినిమాకు కూడా విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. సినిమాలో కథను చక్కగా చూపుతూ నటీనటుల నుండి నటన రాబట్టడంలో సక్సెస్ అయిన రాజేష్ బేబీ సినిమా విశేషాలను అలాగే హీరో, హీరోయిన్లకు సన్నివేశాలను ఎలా వివరించారు వంటి విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఆనంద్ కు రోజూ రెండు పెగ్గులు మందు తాగించా…

కొన్ని సన్నివేశాల కోసం మొహం చాలా పేలాగా ఉండటం కోసం ఆనంద్, అలాగే విరాజ్ కు మందు తాగించిన సందర్భాలు ఉన్నాయంటూ చెప్పి షాకిచ్చాడు డైరెక్టర్ సాయి రాజేష్. ఆనంద్ కి రోజూ సెట్స్ కి వచ్చాక ఒక రెండు పెగ్గుల మందు తాగించి ముందే సీన్ కి సంబంధించిన బిజీఏం వేసి ఫీల్ వచ్చేలా చేసాక నటించమనేవాడిని. అందుకే సీన్స్ చాలా సహజంగానే ఉన్నాయి అంటూ చెప్పారు.

ఇక స్కూల్ లో టీచర్ కొట్టే సీన్ లో వైష్ణవి చైతన్య నిజంగానే కొట్టించుకుంది. షెడ్యూల్ లో లాస్ట్ సీన్ అవడం వల్ల లొకేషన్ మళ్ళీ దొరకదనే టెన్షన్ లో ఉన్నపుడు సీన్ సరిగా రాకపోయే సరికి వైష్ణవి నిజంగానే కొట్టమని చెప్పండి అపుడే ఫీల్ వస్తుందని కొట్టించుకుంది. కానీ కొట్టగానే నాకే కళ్ళళ్ళో నీళ్లు వచ్చాయి. కానీ సీన్ సరిగా రాలేదని ఆలోచిస్తుంటే వైష్ణవి మళ్ళీ కొట్టించుకుంది. అలా మూడు సార్లు అయ్యాక సీన్ ఓకే అయింది. అలా శాడిజం చూపించాను ఆర్థిస్టుల మీద అంటూ చాలా కష్టపడి పనిచేసారు అందరూ, సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పారు సాయి రాజేష్.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

11 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago