Actress Hema : తెలుగులో హీరోయిన్ స్నేహితురాలిగా మొదలై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన హేమ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. హేమ అసలు పేరు కృష్ణ వేణి తనది రాజోలు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కూడా బాగా వైరల్ అయిన హేమ ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచారు. ఆ మధ్య మా ఎన్నికల సమయంలో శివబాలాజీ తో గొడవ, కొరకడం వంటి విషయాలతో బాగా వైరల్ అయింది హేమ. ఇక హేమ ఎవరి గురించైనా ఏ మాత్రం జంకు లేకుండా ఫ్రాంక్ గా మాట్లాడేస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో హేమ ‘క్షణ క్షణం’ సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఆర్జివి నన్ను అలా చూసేసరికి భయమేసింది…
మొదటి నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ స్నేహితురాలు, హీరో సిస్టర్ ఇలా మొదలు పెట్టి ప్రస్తుతం అత్త అమ్మ వంటి పాత్రలను చేస్తున్న హేమ మొదట్లో తాను చేసిన సినిమాల గురించి మాట్లాడుతూ క్షణ క్షణం సినిమా టైంకి సెకండ్ హీరోయిన్, లేదా హీరోయిన్ పాత్రలనే చేయాలి అని డెసిషన్ తీసుకున్నాను అప్పుడే క్షణక్షణం సినిమా ఆఫర్ వచ్చింది. అందులో సెకండ్ హీరోయిన్ అవకాశం మొదటి హీరోయిన్ శ్రీదేవి అని చెప్పడంతో ఒప్పుకున్నాను.
మొదటి సారి ఫ్లైట్ ఎక్కింది కూడా ఆ సినిమాతోనే ఎక్కాను అంటూ చెప్పిన హేమ ఆ సినిమా షూటింగ్ అపుడు శ్రీదేవి పక్కన కూర్చొని ఉంటే ఆర్జివి నా వైపు అదోలా చూసాడు. నాకు అప్పటికే సినిమా ఇండస్ట్రీ గురించి రకరకాలుగా చెప్పడం వల్ల భయమేసింది. పక్కకు వెళ్లి నేను వెళ్ళిపోతాను అని ఏడ్చేసాను, శివ నాగేశ్వరావు వాళ్ళు వచ్చి ఆయన అలానే చూస్తారు నిన్ను కాదు చూసింది. ఇపుడు నువ్వా కుర్చీలో లేవు కానీ ఆయన ఆ కుర్చీ వైపే చూస్తున్నారు కదా ఆయన సీన్ ఆలోచిస్తున్నారు అంతే అంటూ చెప్పారట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…