Samantha: నటి సమంత తన ఆరోగ్యం పై దృష్టి పెట్టి ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా ఈమె సినిమాలపై ఫోకస్ చేస్తూ వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి తరుణంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు. ఇలా ఈ వ్యాధి బారిన పడిన ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండి చికిత్స తీసుకున్నారు.
ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోని సమంత సినిమాలకు ఏడాది పాటు విరామం ఇచ్చేసి పూర్తిగా తన ఆరోగ్యం పైనే దృష్టి పెట్టారు.ఈ విధంగా సినిమాలకు దూరమైనటువంటి ఈమె ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా సినిమాలకు దూరమైనటువంటి సమంత సద్గురు ఇషా సెంటర్లో ప్రత్యక్షమయ్యారు.
ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈమె మెడిటేషన్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే సమంత ఈ ఫోటోలను షేర్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
కొంతసేపటి వరకు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ కదలికలు లేకుండా కూర్చోవడం చాలా కష్టం అనుకున్నాను. కానీ అయితే ఈరోజు ధ్యానస్థితి నాలో శక్తికి అత్యంత శక్తివంతమైన మూలంగా ప్రశాంతంగా మారిందని ఈ ప్రక్రియ ఇలా సింపుల్గా శక్తివంతంగా ఉంటుందని తాను అనుకోలేదు అంటూ ఈ ఫోటోలను షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…