Featured

Baby heroine Vaishnavi : ఎన్నో అవమానలను ఎదుర్కొన్నా… నన్ను నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చింది ఆయనే…: బేబీ హీరోయిన్ వైష్ణవి

Baby heroine Vaishnavi : యూట్యూబర్ గా అందరికీ సుపరిచితురాలైన వైష్ణవి, యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అయి ఆ తరువాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. అలా మంచి పేరు తెచ్చుకున్న వైష్ణవి ఒకవైపు వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ప్రేక్షకులకు దగ్గరయింది. కొన్ని సినిమాల్లో సహాయక పాత్రలను చేస్తూ మెప్పించిన వైష్ణవి తాజాగా ‘బేబీ’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. అ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన కెరీర్ లో ఎదుర్కొన్న కష్టాలను గూర్చి ఎమోషనల్ గా మాట్లాడింది వైష్ణవి.

ఆయనే నన్ను నమ్మిన వ్యక్తి…

సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునే తాను సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గానో ఎక్కడో ఒక నిమిషం కనిపించే పాత్రలలో చేస్తూ ఉన్న తనకు హీరోయిన్ గా అవకాశం వస్తుందని ఎపుడూ అనుకోలేదని వైష్ణవి చెప్పింది. హీరోయిన్ గా చేయాలని ఉన్నా తనను ఎవరు పెట్టుకుంటారు అనుకునేదాన్ని కానీ బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ నన్ను నాకన్నా ఎక్కువగా నమ్మి ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నారు. నేను హీరోయిన్ అనగానే భయపడ్డాను, చేయగలనా అనిపించింది కానీ ఆయన ఇచ్చిన నమ్మకం వల్లే చేయగలిగాను.

ఇక్కడ దాకా రావడానికి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినపుడు నిమిషం కనిపించినా నా వాళ్లందరినీ తీసుకెళ్లి చూపించేదాన్ని, ఏరోజు కైనా హీరోయిన్ అవుతానా అనుకునేదాన్ని అంటూ ఎమోషనల్ అయింది వైష్ణవి. నిర్మాత ఎస్కేఎన్ నన్ను ఒక బేబీలాగానే చూసుకున్నారు అంటూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కంటతడి పెట్టుకుంది వైష్ణవి. బేబీ సినిమాలో విజయ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవర కొండ హీరో కాగా విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జులై 14న విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago