తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ చిత్ర పోకడ పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన టాలీవుడ్ పరిధి దేశం మొత్తం వ్యాప్తి చెందింది.. ఈ ముహూర్తాన ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యిందో అప్పటినుంచి అందరు హీరోలు, అన్ని సినిమాలు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమా చేయాలనీ , దేశం మొత్తం పేరుతో పాటు డబ్బు సంపాదించాలని ఆరాటపడుతున్నారు..
ఇకపోతే బాహుబలి ఈ రేంజ్ లో హిట్ అవడానికి కారణం ఆ సినిమా ని అంతబాగా చెక్కిన జక్కన్ననే.. ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా రాజమౌళి ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు. పాన్ ఇండియా సినిమాకు అసలు సిసలైన అర్థాన్ని దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న చూపించారు. అయితే.. ఆ సినిమా 1,2 పార్ట్‌లతోనే ఆగిపోకూడదని పార్ట్-03 కి కూడా తెరకెక్కించాలని నెట్ ఫ్లిక్స్‌తో కలిసి జక్కన్న ప్లాన్ చేశారు. అందుకు జక్కన్న ప్రముఖ రైటర్స్‌తో కలిసి రాజమౌళి కథ రెడీ చేయించారు. దీనికి ‘బిఫోర్ ద బిగినింగ్’ టైటిల్ అనుకున్నారు.
తెలుగు దర్శకులైన.. టాలీవుడ్‌లో తమ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రవీణ్ సత్తారు, దేవకట్టాలకు ఈ బాధ్యతలను జక్కన్న అప్పగించారు. ఊహించిన దానికంటే భారీగానే షూట్ చేశారు. కానీ ఫైనల్ కట్ చూసుకున్న తర్వాత నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యానికి అస్సలు నచ్చలేదట. ‘అసలేంటిది.. ఇంత చెత్తగానా..? దీన్ని తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో పడేయండి.. మీ వల్ల వంద కోట్ల నాశనమయ్యాయ్’ అని నెట్‌ఫ్లిక్స్ తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటే కుదరదని డైరెక్ట్‌గా రాజమౌళినే రంగంలోకి దింపాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోందట. త్వరలోనే ఆయన్ను సంప్రదించాలని భావిస్తున్నారట. అయితే.. జక్కన్న ఏమంటారో..? గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వ్యవహారంపై అటు నెట్‌ఫ్లిక్స్ కానీ.. ఇటు ప్రవీణ్ సత్తారు, దేవకట్టాలుగానీ రియాక్ట్ అయితే తప్ప అసలు విషయం తెలిసొచ్చే పరిస్థితులు లేవు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…