Movie News

సౌందర్య అందుకే ఎక్స్ పోజింగ్ చేయలేదు – ఆమనీ..!!

చావు కబురు చల్లగా సినిమా లో ప్రామిసింగ్ పాత్ర చేస్తున్న ఆమనీ ఆ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటూ అందరిని అలరిస్తుంది.. తన కెరీర్ గురించి సినిమా విశేషాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది.. కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా అయినా చావు కబురు చల్లగా రేపు విడుదల అవుతుండగా చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. కాగా ఆమనీ ఓ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

శుభలగ్నం, మావిచిగురు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమనీ అప్పటి తన సహా నటి , హీరోయిన్ సౌందర్య గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. తాము ఇద్దరమే షూటింగ్‌లో ఉన్నపుడు.. ఎక్స్‌పోజింగ్ గురించి అడిగానని చెప్పింది ఆమని. దానికి వెంటనే.. ఎందుకే ఎక్స్‌పోజ్ చేయాలి.. రేపు పెళ్లై మొగుడు పక్కనే ఉన్నపుడు తన సినిమాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది.. మన ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది అలా గ్లామర్ షో చేసినపుడు అంటూ సమాధానం చెప్పిందని గుర్తు చేసుకుంది ఆమని. అందుకే కెరీర్‌లో సౌందర్య ఎప్పుడూ ఎక్స్‌పోజింగ్ చేయలేదని చెప్పుకొచ్చింది ఆమని.

టాలీవుడ్ ని కొన్ని సంవత్సరాలపాటు ఏలిన హీరోయిన్ సౌందర్య హఠాత్మరణం ఇప్పటికి అందరిని కంట తడి పెట్టిస్తుంది. సావిత్రి తర్వాత టాలీవుడ్ ని ఏకచత్రాధిపత్యంగా ఏలింది సౌందర్య.. టాప్ హీరోలందరూ ఆమెతో నటించాలనుకునేవారే.. ఆమె డేట్స్ లేవంటే ఆమెకోసం వెయిట్ చేసి మరీ డేట్స్ ఖాళీ అయ్యాక ఆమెతో సినిమాలు చేసేవారు. అందం, అభినయం కలిగిన సౌందర్య అన్ని పాత్రల్లో తనదైన మార్క్ చూపించేది.. ఎలాంటి క్యారెక్టర్ లోఅయినా యిట్టె ఒదిగిపోయి దర్శక, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించేది.

TD Admin

Recent Posts

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

6 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

7 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

7 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

24 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

1 day ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

1 day ago