Categories: Movie News

భారీ స్కాం చేసిన ఆ సీనియర్ నటి కొడుకు..26 కోట్లు పైగా..!!

సినిమాల్లోలాగానే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఘరానా మోసాలు చేస్తున్నారు కొందరు.. టెక్నాలజీని, ప్రజల ఆశని, వారి అమాయకత్వాన్ని ఉపయోగించుకుని కొందరు మోసాలు కోట్లకు స్కాం లు చేస్తూ వారు కోటీశ్వరులవుతున్నారు. అయితే ప్రజలకు రోల్ మోడల్ గా ఉండాల్సిన వారు కూడా ఇలాంటి మోసాలు చేయడం సమాజానికే సిగ్గు చేటు వంటిది. తాజాగా ఓ నటి కొడుకు 26 కోట్లకు మోసం చేసి పట్టుపట్టారు.. వివరాల్లోకి వెళితే…

ప్రముఖ నటి జయచిత్ర కుమారుడు జి. అమరేశ్ గణేష్ (30) చెన్నైకి చెందిన వ్యాపారవేత్తను ‘రైస్ పుల్లింగ్’ పేరుతో మోసం చేశాడు. వ్యాపారవేత్త నుంచి ఏకంగా రూ.26.2 కోట్లు కాజేశాడు. ఆ వ్యాపారవేత్త కేసు పెట్టడంతో అమరేశ్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మోసపోయిన వ్యాపారవేత్త పేరు వి. నేదుమారన్. ఆయన వయసు 68 సంవత్సరాలు. చెన్నై సమీపంలోని వలసరవక్కం నివాసి.

తమ వద్ద ఓ ఆలయానికి చెందిన కలశం ఉందని, దాన్ని ఖరీదైన లోహం ఇరేడియంతో తయారుచేశారని, ఆ కలశం బియ్యాన్ని ఆకర్షిస్తుందని నేదుమారన్‌ను అమరేశ్ గ్యాంగ్ నమ్మబలికింది. 2013 నుంచి మూడేళ్ల పాటు అమరేశ్, అతడి స్నేహితులు నేదుమారన్ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారు. కానీ, వాళ్లు ఎంతకీ కలశం ఇవ్వకపోవడంతో నేదుమారన్ తాను మోసపోయానని గ్రహించారు. దీంతో చెన్నై పోలీస్ కమీషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నేదుమారన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం అమరేశ్‌ను అరెస్ట్ చేశారు. అమరేశ్ ఒక తమిళ చిత్రంలో నటించారు. అలాగే, కొన్ని తమిళ సినిమాలకు సంగీత దర్శకుడిగానూ వ్యవహరించారు.

TD Admin

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago