వకీల్ సాబ్ మూవీ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కోట్లాదిమంది ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకుడు కాగా ఏప్రిల్ 9 వ తేదీన ఉగాది పండుగ ను పురస్కరించుకొని విడుదల కి సిద్దం కానుంది. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా ని ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి..
ఈ తరుణంలో ఈ సినిమా అదిరిపోయింది అంటూ రివ్యూ ఇచ్చేశారు ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు. మోస్ట్ కాంట్రవర్సియల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ క్రిటిక్‌గా తనని తాను ప్రకటించుకున్న ఉమర్.. సినిమా విడుదలకు ముందే తాను సినిమాలు చూశానంటూ చెప్పాడు. ఇటీవల ఇతని ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ కావడంతో మళ్లీ కొత్త అకౌంట్‌తో రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు.పాజిటివ్ బజ్‌తో ఈ సినిమా విడుదలౌతుండటంతో హిట్ పక్కా అని విశ్లేషకులు చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నారు.అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల కీలకపాత్రల్లో కనిపించారు.
ఎలక్షన్స్ వచ్చే వరకు ఎన్ని సినిమాలు వీలుకైతే అన్ని సినిమాలు చేయాలనీ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిన విషయం తెలిసిందే..అందుకే వకీల్ సాబ్ తర్వాత జోరుగా సినిమాలు మొదలుపెట్టారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలోని ఏకే రీమేక్ చిత్రం ముగింపు దశకు వచ్చేసింది. క్రిష్ దర్శకత్వంలోని వీరమల్లు సినిమా ఇప్పటికే పూర్తి కావొచ్చింది. ఇంకా హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా ఉంది. ఈ నాలుగు సినిమాలే కాకుండా పవన్ కళ్యాణ్ పూరి దర్శకత్వంలో ఓ సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనీ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…