టాలీవుడ్ లో కొందరి హీరోయిన్ ల పరిస్థితి ఎలా ఉంటుందంటే టాలెంట్ ఉన్నా వారిని అదృష్టం వరించదు. సినిమాలు చేస్తూనే ఉంటారు హిట్ లు అవుతూనే ఉంటాయి కానీ వారికి మాత్రం తగినంత పేరు రాదు. దాంతో వారు కొన్ని సినిమాలకే ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. ఆలా టాలెంట్ ఉన్నా పెద్ద హీరోలతో ఛాన్స్ లు దక్కని హీరోయిన్ గా ఉన్నాడు నివేదా థామస్.. నాని జెంటిల్ మ్యాన్ సినిమా తో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైనా నివేదా తొలి సినిమా తో తన క్యూట్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.
రెండో సినిమా కూడా నానితోనే చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకునేలా చేసుకుంది. నిన్ను కోరి లో మెచ్యూర్డ్ గా తన పర్ఫార్మెన్స్ ని చూపించి దర్శక నిర్మాతలను ఆకరిషించింది.. దాంతో ఆమెకు ఎన్టీఆర్ సరసన జైలవకుశ లో నటించే అవకాశం వచ్చింది. అందులో కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది నివేదా.. అయితే ఆమెకు అనుకున్నంత పేరు రాలేదు.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా నివేదిక ఎందుకో స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాలేదు.
దీనికి తగ్గాలంటూ నివేదా కు కొంతకాలంగా ఛాన్సులు రావడం తగ్గాయని, అందుకే కొత్త ప్రాజెక్టులలో తన పేరు వినిపించట్లేదని వార్తలు వస్తున్నాయి.. దీనికి కారణం తను నటనా ప్రాధాన్యమున్న పాత్రలు మాత్రమే చేయడమేనట. ఇప్పుడు ట్రెండ్ ప్రకారం నటన కంటే అందాల ఆరబోతకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు హీరోయిన్ లు. నిత్యా మీనన్ వెనుక పడటానికి రీజన్ కూడా ఇదే. నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలు వచ్చే వరకు వెయిట్ చేయడం తప్ప వీరు చేయగలిగింది మరోకటి లేదు. నివేదా కూడా ఆదరిలోనే వెళ్లడం వల్ల ఆమెకు అవకాశాలు తగ్గాయి.. ప్రస్తుతం నివేదా కీలక పాత్ర పోషించిన వకీల్ సాబ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తో నైనా ఆమెకు మంచి సినిమా అవకాశం రావాలని కోరుకుందాం..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…