Bahumukham: బహుముఖం మూవీ రివ్యూ అండ్ రేటింగ్!

Bahumukham: హర్షివ్ కార్తీక్ నిర్మించి దర్శకత్వం వహించిన తాజా సినిమా బహుముఖం. ఇందులో యా మార్టినోవా ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా ఫణి కళ్యాణ్ సంగీతం అందించారు. కాగా ఇటీవల ఏప్రిల్ 5న రిలీజయిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. మరి ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అన్న వివరాల్లోకి వెళితే..

కథ :

కథ విషయానికి వస్తే.. తన్వీర్ ఫ్యామిలీ అమెరికాలో స్థిరపడి ఉంటారు. తన్వీర్ వాళ్ళ అమ్మకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ యాక్టర్ కాలేకపోతుంది. డాంతో తల్లి కలని నిజం చేయాలని చిన్నప్పుడు అనుకుంటాడు తన్వీర్. అయితే అనుకోకుండా జైలుకి వెళ్లి కొన్ని సంవత్సరాల తర్వాత బయటకి వస్తాడు. బయటకి వచ్చాక నటుడు అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు తన్వీర్ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొడుతూ ఉంటాయి. జైలు నుంచి బయటకు రావడంతో అతనికి ఒక కౌన్సిలర్ కూడా ఉంటుంది. ఒక సారి సైకో పాత్ర ఆడిషన్ ఇస్తే సరిగ్గా చేయలేదని విమర్శిస్తారు. దీంతో అతను ఎలాగైనా ఆ పాత్రని బాగా చేయాలని, మంచి నటుడు అవ్వాలని బాధపడుతూ, దానికోసం నిజమైన సైకోలా మారిపోయి హత్యలు చేస్తాడు. అసలు తన్వీర్ జైలుకి ఎందుకు వెళ్ళాడు? తన్వీర్ ఎందుకు సైకోలా మారిపోయాడు? తన్వీర్ ఎందుకు హత్యలు చేశాడు? ఈ విషయాలు అన్ని తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : కాగా డైరెక్టర్ హర్షివ్ కార్తీక్ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూ మరో పక్క ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకి అన్ని అతనే కావడం విశేషం. కాగా ఈ సినిమా మొత్తం అమెరికాలోనే షూటింగ్ చేశారు. దీంతో అక్కడ ఉన్న ఇండియన్స్, అమెరికా నటీ నటులతో తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే బాగున్నా అక్కడక్కడా కథ కొంచెం సాగుతున్నట్టు అనిపిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మాత్రం బాగా రాసుకున్నారు. కానీ థ్రిల్లింగ్ సినిమాకి సరిపడా ట్విస్టులు మాత్రం లేవని అనిపిస్తుంది.

నటీనటుల పనితీరు : ఈ సినిమా మెయిన్ లీడైన హర్షివ్ కార్తీక్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించారు. ఒక పక్క నటుడు అవ్వాలనే తపనతో, మరో పక్క సైకోగా అదరగొట్టాడు తన్వీర్. స్వర్ణిమ సింగ్ హీరోయిన్ అని చెప్పినా కొన్ని సీన్స్ లో మాత్రమే కనిపిస్తుంది. ఆమెకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్న పర్వాలేదని అనిపించింది. అమెరికన్ నటి మరియా మార్టినోవా మెప్పిస్తుంది. ఇక మిగిలిన నటీ నటులంతా అమెరికాలో ఉండే వాళ్లనే తీసుకోవడంతో తెలిసిన స్టార్ కాస్ట్ ఎవరూ లేకపోయినా వారి పరిధి మేరకు నటీంచారు.

సాంకేంతికత : ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. అలాగే అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ల్యూక్ ఫ్లెచర్ విజువల్స్ చాలా బాగున్నాయి. కథకి తగ్గట్టు అమెరికాని బాగా చూపించారు. శ్రీ చరణ్ పాకాల ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలకి మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి కూడా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. కథను కొత్తగా చూపించడానికి హర్షివ్ కార్తీక్ బాగానే ప్రయత్నించారు.

ప్లస్ పాయింట్స్ : నటీనటుల పనితీరు, మ్యూజిక్

మైనస్ పాయింట్స్ : తెలిసన కథ కావడం

రేటింగ్ : 3