Baladitya: టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బాలాదిత్య ఆ తర్వాత చంటిగాడు సినిమా ద్వారా హీరోగా మారి మంచి గుర్తింపు పొందాడు. అయితే హీరోగా సరైన అవకాశాలు రాకపోవడంతో బుల్లితెర మీద టీవీ షోలలో హోస్ట్ గా కొంతకాలం రాణించాడు. ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించాడు. అయితే చాలా కాలంగా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బాలాదిత్య ఇటీవల బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు.
ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి వివాదాలకు దూరంగా ఉంటూ టైటిల్ విన్నర్ గా నిలవాలని కష్టపడ్డాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో బాలాదిత్య ఆటతీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాలాదిత్య జోరు ఇలాగే కొనసాగితే టైటిల్ గెలవడం ఖాయమని ప్రేక్షకులు అందరూ భావించారు. అయితే ఊహించని పరిణామాల వల్ల హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే బాలాదిత్య సిగరెట్ల కోసం గీతుతో గొడవపడటం.. ఆమెతో కఠినంగా ప్రవర్తించటంతో ప్రేక్షకుల్లో అతని మీద నెగెటివిటీ పెరిగింది.
గీతూతో గొడవ కారణంగా ఈయన 10 వారంలో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చాడు. అయితే హౌజ్ నుండి బయటకి వచ్చే సమయంలో కూడా ఎంతో హుందాగా ప్రవర్తించి.. మరోసారి అందరిని ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా బాలాదిత్య రెండవ కుమార్తె నామకరణ వేడుక చాలా ఘనంగా జరిగింది. బాలాదిత్య భార్య రెండవ కూతురిని ప్రసవించిన కొన్ని రోజులకే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత తాజాగా తన రెండవ కూతురి నామకరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాడు.
ఈ కార్యక్రమంలో బాలాదిత్య బంధుమిత్రులు,కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లందరూ మొదటిసారిగా ఈ నామకరణం కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో వీరందరూ చాలా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…